ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ నిన్న అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.. గత కొన్నేళ్లు గా వార్తల్లో నిలుస్తున్నారు మాస్టర్.. ఈయన స్టార్ హీరోల అందరిచేత కాలుకదిపించాడు.. దాదాపు 1500 లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ పనిచేసిన ఘనత ఆయన సొంతం.. ఆయన మరణ వార్త విని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారని తెలుస్తోంది. అయితే రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడైన శేఖర్ మాస్టర్ తన గురువును కడసారి చూసేందుకు వస్తారా రారా అన్న దానిపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం ఉదయం రక్తపు విరేచనాలు కావడంతో ఇక పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు.. తెలుగు పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమాలతో ఆయనకు డ్యాన్స్ మాస్టర్‌గా మంచి పేరు వచ్చింది. వైవీఎస్ రూపొందించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ ‘దేవదాసు’ సినిమాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేసారు. ఆ సినిమాలు హిట్ అవ్వడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది..

ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చక్రం తిప్పుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం గమనార్హం. ఇక, కానరాని దూరాలకు వెళ్లిపోయిన రాకేష్ మాస్టర్‌ను ఆఖరి చూపును చూసేందుకు వాస్తారా? లేదా పట్టింపు తో ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.. రాకేష్ మాస్టర్ చనిపోయాక అంతా శేఖర్ మాస్టర్ వస్తారని అనుకుంటున్నారు. వాళ్లిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది. అయితే మధ్యలో ఇద్దరికీ చెడిన విషయం తెలిసిందే. కానీ మనిషే పొయ్యాక పట్టింపులు ఎందుకు అని వస్తారేమో చూడాలి. ఏదీ ఏమైనా కూడా ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.. చూద్దాం ఏం జరుగుతుందో..