Sai Pallavi : సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనేది మేల్ డామినేటెడ్ అని ఎప్పటి నుంచో పేరుంది. ఇక్కడ ఆడవారిని కాస్త తక్కువ చేసి చూస్తారనే అభిప్రాయం అందరి మనసుల్లో నాటుకు పోయింది. కేవలం వారిని ఓ ఆటబొమ్మలా ట్రీట్ చేస్తారని.. కలర్ బాగుండి.. స్లిమ్ గా ఉండి సినిమాకు కావాల్సినంత గ్లామర్ పండిస్తే చాలని భావిస్తారు. ఇక పరిశ్రమలో రాణించాలంటే వారు కొన్ని అంశాల్లో తప్పనిసరిగా చెప్పినట్లే వినాలి. కానీ చాలా కొద్దిమంది హీరోయిన్ల విషయంలో మాత్రం ఇలాంటి నిబంధనలు ఏవి పని చేయవు. వారికి కథ నచ్చితేనే సినిమా చేస్తారు.. లేదంటే కామ్ గా ఉంటారు తప్పితే.. హీరోయిన్ అవకాశాల కోసం అడ్డమైన దారులన్నీ తొక్కరు.

ఈ వారిలో హీరోయిన్ సాయి పల్లవి ఒకరు. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమా యాక్సెప్ట్ చేస్తుంది. ఓవర్ మేకప్ లేకుండా నటిస్తుంది. ఇక డ్యాన్స్ విషయంలో సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెమలితో పోటీ పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. అందం, డ్యాన్స్, అభినయం అన్ని ఉన్నాయి. ఇండస్ట్రీలో ఆమెది వేరే రూట్. పాత్ర నచ్చితే రెమ్యూనరేషన్ గురించి కూడా పట్టించుకోదు. తనకు మంచి పాత్రలు కావాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తోంది.
దాంతో పాటు బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో కూ నటిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ సరసన సీత పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో రామాయణ సినిమాకు సంబంధించి సాయి పల్లవి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా కోసం ఈ బ్యూటీ బాగానే డిమాండ్ చేసిందట. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి రామాయణ కోసం ఏకంగా 15 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది.

రామాయణ సినిమాను చిత్ర బృందం మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో.. సాయిపల్లవి.. మూడు పార్ట్స్ కి కలిపి రూ.10- రూ.15 కోట్ల వరకు ముట్టజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పారితోషికం విషయంలో సాయి పల్లవి.. నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు జనాలు. బాలీవుడ్ రామాయణ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.