Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మంచి ఫుడ్డీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ తో పని చేసే సెలబ్రిటీలు ఎవరైనా సరే.. ప్రభాస్ భోజనం పెట్టి జనాలను చంపేస్తాడంటూ ఫన్నీగా చెబుతుంటారు. తనతో వర్క్ చేసే సెలబ్రిటీలకి ఇష్టమైన వంటలు అన్ని ఇంటి వద్దే వండించి తీసుకొచ్చి పెట్టడం ప్రభాస్ కు మొదటి నుంచి అలవాటు. అలాగే ప్రభాస్ తాను ఎప్పుడు భోజనం చేసినా సరే తనతో పాటు మరో 10 లేదా 20 మంది కలిసి భోజనం చేయాల్సిందే. వీరందరికి తన డబ్బులతోనే స్వయంగా భోజనం పెట్టిస్తాడు ప్రభాస్. ఇక తను తినేటప్పుడు అన్ని రకాల వంటకాలు మెనూలో ఉండాల్సిందే.
ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడు ఏది తింటాడో ఎవరికి తెలియదు. అందుకే అన్ని రకాల వంటలు భోజనానికి ముందే రెడీ చేసి పెడతారు. ప్రభాస్ కి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి తన వెంట ఒక టీం ఎప్పుడూ ఉంటుందట. మెజారిటీగా గోదావరి స్టైల్ వంటకాలను ప్రభాస్ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కోసారి సెట్ లో పని చేసే అందరికీ కూడా ప్రభాస్ భోజనం తెప్పిస్తూ ఉంటాడట. ఇక ఇప్పటికే దీపికా పదుకొనే, కృతి సనన్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ప్రభాస్ చేతి భోజనం రుచి చూశారు. అతను పెట్టే ఫుడ్ తింటే రెగ్యులర్ గా ఫాలో అయ్యే డైట్ మర్చిపోవాల్సిందే అంటూ ఈ స్టార్ హీరోయిన్స్ కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ ఆతిథ్యం ఏ రేంజ్ లో ఉంటుందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒక్కరోజు ప్రభాస్ డిన్నర్ కు పెట్టే ఖర్చు ఏకంగా లక్షల్లో ఉంటుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇది సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఒక రాత్రి ఫుడ్ కోసమే ప్రభాస్ ఖర్చు చేస్తాడట. ఈ స్థాయిలో భోజనం కోసం ఖర్చు చేసే హీరోలు టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కూడా ఎవ్వరు లేరనే చెప్పాలి. ఇక కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఏకైక హీరో కూడా ప్రభాస్. అందుకే మిగతా హీరోలు కూడా ప్రభాస్ సినిమాలు చూడడానికి కూడా ఆసక్తి చూపిస్తారు.