DJ Tillu 2 : ‘DJ టిల్లు2’కు హీరోయిన్​ దొరికేనా.. హ్యాండిచ్చిన మరో భామ .. తెరపైకి మరో పేరు..!

- Advertisement -

DJ Tillu 2 : డీజే టిల్లు మూవీ ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ హిట్ టాక్​ను సంపాదించుకుంది. ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఓ చోట.. అట్లుంటది మనతోటి.. ఇది నిజంగనే నన్ను అడుగుతున్నవ రాధికా.. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు, నాదసలే డెలికేట్ మైండ్ అంటూ డైలాగ్స్ వినపడుతూ ఉంటాయి. ఇక డీజే టిల్లు టైటిల్ సాంగ్ లేనిదే ఏ పార్టీ నడవదు. అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీకి సీక్వెల్ తీయాలని చిత్రబృందం డిసైడ్ అయింది.

DJ Tillu 2
DJ Tillu 2

అనుకున్నట్టుగానే డీజే టిల్లు షూటింగ్ స్టార్ట్ చేశారు. దీపావళి సందర్భంగా టిల్లు స్క్వేర్ అంటూ టైటిల్ కూడా ఖరారు చేసింది. ఇక త్వరలో షూటింగ్ పూర్తి చేసి త్వరత్వరగా రిలీజ్ చేద్దామని అనుకున్న చిత్రబృందానికి ఓ సమస్య వచ్చి పడింది. ఒకసారి వస్తే ఏదోలే అనుకుంటాం.. కానీ ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తోంది. డీజే టిల్లు అదేనండి మన సిద్ధూతో రొమాన్స్ చేసే హీరోయిన్​ దొరకడం లేదు. వచ్చిన వాళ్లంతా సిద్ధూతో రొమాన్స్ చేయలేమంటూ తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతున్నారట.

Siddu Meenakshi

ముందు టిల్లు స్క్వేర్​లో కూడా రాధికను అదేనండి నేహా శెట్టిని హీరోయిన్​గా అనుకున్నారు. ఓ వారం రోజులు ఈ భామ షూటింగ్ కూడా చేసింది. అయితే రొటీన్ క్యారెక్టర్.. మరీ తన క్యారెక్టర్​ను నెగిటివ్​గా చూపించడం.. కొన్ని మిస్​అండర్​స్టాండిగ్స్​తో నేహా ఈ టీమ్​కు.. ఈ సినిమాకు గుడ్​ బై చెప్పేసింది.

- Advertisement -
Meenakshi Chaudhary

రాధిక గుడ్​ బై చెప్పిన తర్వాత లైన్​లోకి అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ కూడా కొన్ని అభిప్రాయ బేధాలతో తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మలయాళి భామ మడోన్నా సెబాస్టియన్ వచ్చినట్లు టాక్ వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా దీనికి నో చెప్పినట్లు తెలుస్తోంది. మడోన్నా స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా హిట్-2తో హిట్ కొట్టింది మీనాక్షి.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలుస్తోంది. సంక్రాంతి తరువాత మంచి డేట్ చూసుకుని మళ్లీ ఫిబ్రవరి నెలలోనే సినిమా విడుదల చేసేందుకు సినిమా యూనిట్ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరిలోనే విడుదల కుదరక పోతే ఒక నెల ఆలస్యంతో మార్చిలో రిలీజ్ చేయనున్నారట.

ఇక్కడ మరో విషయం ఏమంటే.. మొదట ఈ సినిమాలో శ్రీలీలను అనుకున్నారు. ఆమె కూడా డిఫరెన్సెస్‌తో తప్పుకుందని అప్పట్లో టాక్ నడిచింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా హీరో సిద్ధునే స్క్రిప్ట్, డైలాగ్స్ రాశారట.

వరుస పెట్టి హీరోయిన్లు తప్పుకోవడంపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇది హీరోయిన్ల సమస్యనా.. లేక చిత్రబృందం ప్రాబ్లమా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. సిద్ధూతో రొమాన్స్​కు హీరోయిన్లు భయపడుతున్నారంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. తొందరగా సినిమా రిలీజ్ చేస్తే చూసి ఎంజాయ్ చేస్తామంటూ మరి కొందరు అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com