Bigg Boss Ashwini : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ అశ్వినీ శ్రీ. ఈమె అందంగా ఉంటుంది, టాస్కులు కూడా మగవాళ్ళతో సమానంగా ఆడుతుంది. కానీ బాగా ఎమోషనల్ వ్యక్తి అనే విషయం బిగ్ బాస్ చూసినప్పుడు అందరికీ అర్థం అయ్యింది. అయితే ఈ వారం లో ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే ఆమె తనకి తానూ సెల్ఫ్ నామినేట్ చేసుకుంది, ప్రస్తుతం ఓటింగ్ లో కూడా ఆమె అందరికంటే తక్కువ ఓట్లతో కొనసాగుతుంది. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా ఎవరికీ తెలియదు. పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కూడా ఉందని ఇన్ని రోజులు తెలియలేదు.

ఈ సినిమాలో రోటి షాప్ లో పని చేసే అమ్మాయిగా అశ్వినీ నటించింది. ‘చోలే కి పీచే’ అనే పాటకి పవన్ కళ్యాణ్ ని ఈమె చూస్తూ ఉంటుంది, ఆయన సిగ్గుపడుతూ నడుస్తూ ఉంటాడు, ఆ సన్నివేశం గుర్తుంది కదా, అందులో నటించింది ఈమెనే. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు అశ్వినీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తో పని చేసిన అనుభూతిని పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచెయ్యడం నా అదృష్టం, ఆయనతో పని చేసాక పెద్ద ఫ్యాన్ అయ్యాను, దేవుడి లాంటి మనిషి. నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. నా ఇబ్బంది ని గమనించి నాకు పవన్ కళ్యాణ్ గారు తన కారవాన్ ని వాడుకోనిచ్చారు. ఖాళీ సమయం లో అశ్విని ఇటు వచ్చి కూర్చో, ఒక మంచి పాట పాడు అని నాతో పాటలు పాడించుకునేవారు. నేను ఎన్నో కబుర్లు కూడా చెప్పుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి, ఒక సూపర్ స్టార్ ఇంత సింపుల్ గా మాలాంటి ఆర్టిస్టులతో కూడా మాట్లాడుతారా అని అనిపించింది. నాకు కళ్యాణ్ గారు డ్రై ఫ్రూప్ట్స్ కూడా పెట్టేవారు’ అంటూ చెప్పుకొచ్చింది అశ్వినీ.