OTT Movie Review : ఈమధ్య కాలం లో థియేటర్స్ లో చూసే ఆడియన్స్ కంటే ఎక్కువగా ఓటీటీ లో చూసే ఆడియన్స్ ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఓటీటీ కి ఎలాంటి సెన్సార్ లేదు కాబట్టి మేకర్స్ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అడల్ట్ మరియు బోల్డ్ కంటెంట్స్ తో మన ముందుకు వస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే ఆడియన్స్ ఓటీటీ లో చూసేందుకు ఏ మాత్రం కూడా ఆలోచించడం లేదు. ప్రతీ వారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో వైల్డ్ వైల్డ్ పంజాబ్ అనే హిందీ అడల్ట్ కామెడీ చిత్రం విడుదలై మంచి ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
తాగిన మత్తులో ఉన్న అబ్బాయిల గ్యాంగ్ లో ఒక స్నేహితుడికి తన మాజీ ప్రియురాలు గుర్తొచ్చి, ఆమెకి పెళ్లి జరిగే విషయాన్ని తన స్నేహితులతో పంచుకొని బాధపడతాడు. దీంతో ఆ స్నేహితులు తాగిన మైకం లో ఆ మాజీ ప్రేమికురాలి పెళ్లి ని ఎలా అయినా చెడగొట్టాలని నిర్ణయం తీసుకొని బయలుదేరుతారు. ఈ ప్రయాణం లో వారికి కొన్ని దురదృష్టకరమైన సంగటనలు చోటు చేసుకుంటాయి. అవి వారి ప్రయాణం లో ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
సినిమా నిడివి చాలా తక్కువ ఉండడం తో మంచి టైంపాస్ గా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు మనకి తెలుగు లో బ్లాక్ బస్టర్ గా నిల్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం గుర్తుకువస్తుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. కానీ అనేక సన్నివేశాలకు లాజిక్స్ ఉండవు. అడల్ట్ కంటెంట్ అవ్వడం తో ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడలేము. లిప్ లాక్ సన్నివేశాలు చాలానే ఉంటాయి. స్టోరీలైన్ ఆసక్తి గానే ఉన్నప్పటికీ, టేకింగ్ లో కథ గాడితప్పుతుంది. కొన్ని సన్నివేశాలు చిరాకు తెప్పించినప్పటికీ, ఎంటర్టైనింగ్ గానే అనిపిస్తుంది.
చివరి మాట : ఓవరాల్ గా అడల్ట్ కామెడీ ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ప్రస్తుతం టాప్ 3 లో ట్రెండ్ అవుతూ ఉంది.