Niharika Konidela : ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ కు గురవుతుందో చూస్తూనే ఉన్నాం. ఆ ఫ్యామిలీ ఏ చిన్న విషయం తెలిసినా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇది తన చిరంజీవి చిన్న కూతురు రెండో సారి డివోర్స్ తీసుకున్న దగ్గర్నుంచి మరీ ఎక్కువైంది. ఆమె తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక కూడా ఇటీవల డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో వైభవంగా వివాహం చేసుకున్న నిహారిక ఆ తర్వాత వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు . అప్పటినుంచి నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారింది.
ప్రస్తుతం తన కెరీర్ ను లైన్లో పెట్టే పనిలో ఉంది నిహారిక.. మునుపటి మీద మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతగా మారనుంది. మంచి మంచి ఫోటోషూట్ చేయడానికి ఇష్టపడుతుంది . అయితే విడాకులు తీసుకున్న కూతురు ఇంట్లో ఉంటే నాగబాబు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నాడు అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీనికి మెగా ఫ్యాన్స్ కూడా ఘాటుగా ఆన్సర్ ఇస్తున్నారు. మన సైడ్ తప్పు లేనప్పుడు.. ఎలాంటి తప్పు మనం చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు. నిహారిక గురించి తన తండ్రి నాగబాబుకు మొత్తం తెలుసు. అలాంటి ధైర్యం ఉండబట్టే నాగబాబు సైలెంట్ గా ఉన్నాడట. తన కూతురు బంగారం అన్న విషయం వేరొకరికి తెలియాల్సిన అవసరం లేదు అని.. నిహారిక లైఫ్ లో మంచి స్థానానికి వెళుతుందన్న ధీమాతోనే నాగబాబు అంత హ్యాపీగా ఉన్నాడంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.