సినీ ప్రేక్షకులకు యముడు అంటే టక్కున గుర్తొచ్చేది నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణే. ఆయన నటనతో, భారీ ఖాయంతో, ప్రతిభతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. చాలా పౌరాణిక జానపద సినిమాల్లో యముడి పాత్ర వేసి తెలుగు ప్రేక్షకులను మాయ చేసేశారు. ఆ పాత్రల్లో యముడంటే ఇలానే ఉంటాడేమో అనిపించేలా జీవించేస్తారు. ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో మాత్రం యముడిగా నటించలేకపోయారు. అందుకు కారణం లేకపోలేదు.. కాకపోతే అది చాలాకాలం తర్వాత బయటకు వచ్చింది.
కైకాల సత్యనారాయణ ఎన్నో చిత్రాలలో విలన్ గా ,తండ్రి, తాత పాత్రలను పోషించి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. తన సినీ కెరియర్ లో 700కు పైగా సినిమాలలో నటించారు కైకాల సత్యనారాయణ. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో యముడి పాత్రలో అలరించిన కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో మాత్రం యముడిగా నటించలేదు. కేవలం యముడిగా మాత్రమే కాక, విలన్, తండ్రి పాత్రలు, తాత పాత్రలు కూడా పోషించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు కైకాల సత్యనారాయణ. తన అరవై ఏళ్ల సినీ కెరీర్ లో 700 లకు పైగా సినిమాల్లో ఆయన యముడిగా నటించారు.
ఆయన ఓపెన్ హార్ట్ విత్ RK షో లో కైకాల సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. మొదటిసారిగా యమగోల సినిమాలో తాను యముడిగా నటించానని తెలిపారు. ఆ సినిమాలో యముడిగా తాను ఎన్టీఆర్ పోటీ పడి నటించామన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో తనని యముడి పాత్రలో నటించమని చిత్ర యూనిట్ కోరారని.. కానీ రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడం వల్లే ఆ సినిమాలో నటించలేదని చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని మోహన్ బాబు గారు చేశారు.
మోహన్ బాబు కూడా ఈ సినిమాలోని పాత్ర అద్భుతంగా నటించారు. అప్పటివరకు ఆయన క్రేజ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది.. ఈ సినిమాతో మళ్ళీ తన క్రేజ్ పెంచేసుకున్నారు. అప్పట్లో యమదొంగ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.