Lakshmi Pranathi ఒకప్పుడు ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి ఆహ్వాన పత్రిక అందితేనే ఎంతో గౌరవంగా భావించేవాళ్ళం. అలాంటి మనకి ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డ్ వచ్చింది. నిన్న ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడం అనేది కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఇండియన్ సినీ అభిమానులకు ఎంతో గర్వ కారణం. ఈ అరుదైన గౌరవం దక్కినప్పుడు లైవ్ గా చూసే అదృష్టం రావడం అనేది చాలా అరుదు.
అలాంటి అరుదైన మధుర క్షణాలను జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఎందుకు మిస్ అయ్యింది..?, ఎప్పుడు ఫారిన్ కి వెళ్లినా తన భార్య పిల్లలను వెంటతీసుకొని వెళ్లే జూనియర్ ఎన్టీఆర్, ఈసారి మాత్రం ఎందుకు ఒంటరిగా అమెరికా కి పయనం అయ్యాడు, ఇత్యాది ప్రశ్నలు అభిమానులను మరియు ప్రేక్షకులను నిన్నటి నుండి వెంటాడుతూనే ఉంది.అందుకు అసలైన కారణం ఏంటో తెలిస్తే అభిమానులు బాధ పడక తప్పదు.
ఇక అసలు విషయానికి అసలు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి హాజరు కాదల్చుకోలేదట, కేవలం రామ్ చరణ్ మరియు రాజమౌళి ఒత్తిడి చెయ్యడం వల్ల, కేవలం వాళ్ళ కోసం, మరియు కోట్లాది మంది అభిమానుల కోసం మాత్రమే ఆయన ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి వచ్చాడట. ఎందుకంటే తన సోదరుడు నందమూరి తారకరత్న చనిపోవడమే కారణం గా చెప్తున్నారు. కుటుంబం మొత్తం బాధలో ఉన్నప్పుడు ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొని సంబరాలు చేసుకోవడం ఇష్టం లేకనే ఎన్టీఆర్ ముందుగా ఈ ఈవెంట్ కి హాజరు కాకూడదని అనుకున్నాడట.
కానీ తప్పనిసరి పరిస్థితిలో ఆయన హాజరు కావాల్సి వచ్చింది. అందుకే ఆయన తన కుటుంబ సభ్యులను, సతీమణి లక్ష్మి ప్రణతిని తనతో పాటు తీసుకొని రాలేదని తెలుస్తుంది. అంతే కాదు నిన్న ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత అమెరికా లో ఉన్న రాజమౌళి నివాసం లో పార్టీ జరిగింది.ఈ పార్టీ కి కూడా ఎన్టీఆర్ హాజరు కాకుండా దూరం గా ఉన్నాడు. ఇదంతా తారకరత్న కోసమే అని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం.