Akhil : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఇంటి వారసుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు అఖిల్. వరుస సినిమాలు చేసుకుంటూ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నారు అఖిల్. ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు సరైన సక్సెస్ రాలేదు. చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే కావడంతో అదృష్టం కోసం పరితపిస్తూనే ఉన్నాడు . ఫ్లాపుల పరంగా చూస్తే అఖిల్ ది మాట్లాడుకునే స్టేటస్ రేంజ్ కూడా కాదు .. ఆఫ్ కోర్స్ నాగేశ్వరరావు గారి మనవడు .. నాగార్జున గారు కొడుకు .. అంతవరకు మాత్రమే చెప్పుకోవచ్చు ..అంతేకానీ ఇండస్ట్రీలో టాప్ హీరో అన్న స్థాయికి మాత్రం ఎదగలేకపోయాడు అఖిల్.. ఎన్నో ఎన్నో అవకాశాలు వచ్చాయి . కానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు.

అఖిల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అది అందరికీ తెలిసిన సంగతే. అమల, నాగార్జున కూడా అఖిల్ బిహేవియర్ కి తరచూ తన మీద కోపగించుకుంటూనే ఉంటారట. కారణం అఖిల్ తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ అక్కినేని కుటుంబ సభ్యులకు కూడా నచ్చవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కి కూడా అఖిల్ అంటే పీకల్లోతు కోపం ఉందన్న వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఉపాసన జాన్ జిగిడి దోస్త్ శ్రేయ భూపాల్.. అఖిల్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే .

కారణాలేంటో తెలియదు కానీ.. వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. దానికి కారణం అఖిల్ మొండి బిహేవియర్ .. ఆ తర్వాత శ్రేయ భూపాల్ చాలా డిప్రెషన్ కి గురైందట .. ఎన్నో ట్రీట్ మెంట్స్ తీసుకుందట .. అది కళ్లార చూసిన ఉపాసన పరోక్షంగా అఖిల్ పై కోపం పెంచుకుందట. ఎక్కడ కనిపించినా సరే అఖిల్ తో మాట్లాడకుండా మొఖం తిప్పేసుకుంటుందట. దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.