Bigg Boss Telugu : ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ షో టీఆర్ఫీ రేటింగ్స్ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా పెద్ద సూపర్ హిట్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ బిగ్ బాస్ కొన్ని కొన్ని విషయాల్లో కంటెస్టెంట్స్ కి తీవ్రమైన అన్యాయం చేసాడు అని ఈ షో ని చూసే లక్షలాది మంది అభిమానులకు అనిపించింది.

కేవలం అమర్ దీప్ మరియు ప్రియాంక చేసే ఫౌల్స్ ని మాత్రమే చూపిస్తూ ఇతర హౌస్ మేట్స్ చేసే ఫౌల్స్ ని చూపించడం లేదని, ముఖ్యంగా శివాజీ విషయం లో నాగార్జున ఆయన తరుపున లాయర్ లాగ వ్యవహరిస్తున్నాడని, గౌతమ్ విషయం లో అయితే అసలు చెప్పక్కర్లేదని, అతను ఏమి చేసినా తప్పుగా చూపిస్తున్నారు అంటూ ఎన్నో ఆరోపణలు ఎదురుకుంది బిగ్ బాస్ టీం. ఈ వారం వాస్తవానికి అందరికంటే అతి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ అర్జున్ అట.

కానీ అర్జున్ టికెట్ టు ఫినాలే గెలవడం తో ఈ వారం అతను సేవ్ అయ్యి ఫినాలే వీక్ కి వెళ్లాడని, ప్రజల ఓట్లతో సేవ్ అయిన గౌతమ్ ని అన్యాయంగా ఎలిమినేట్ చేసాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నాగార్జున ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లాల్సిన శోభా శెట్టి ని ఇంకా హౌస్ లో కొనసాగించడం ఒక మిరాకిల్ అయితే, ఆమెకి గౌతమ్ మరియు అర్జున్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అనడం మరో మిరాకల్.

సోషల్ మీడియా లో ఏ పోల్ తీసుకున్నా శోభా శెట్టి కి అందరి కంటే తక్కువ ఓట్లు వస్తున్నాయి. అలాంటి కంటెస్టెంట్ ఇంత దూరం రావడం ఏమిటి ?, ఈమె కోసం ఇంకా ఎంత మంది మంచి కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తారు. ప్రజల ఓట్లతో సంబంధం లేదు అనుకుంటే కప్ మరియు ప్రైజ్ మనీ నేరుగా ఇచ్చేయొచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.