Kumari auntyకుమారి ఆంటీ గురించి కొత్తగా పరిచయమే చేయక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ రీల్స్ ఏ కనపడుతున్నాయి. కుమారి ఆంటీ చెప్పిన డైలాగ్ తో ప్రతి ఒక్కరు కూడా రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ రీల్స్ చేసి నవ్విస్తున్నారు. బిగ్బాస్ ఫేమ్ సీరియల్ నటి కీర్తి భట్ తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ బాలేదని రివ్యూ ఇచ్చింది. కుమారి ఆంటీ ని కలవాలని ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళాము కాబోయే భర్త కార్తీక్ తో కీర్తి భట్ వెళ్ళింది కుమారి ఆంటీ అక్కడ లేకపోవడంతో కనీసం ఫుడ్ అయినా టేస్ట్ చేద్దామని ఒక ప్లేట్ చికెన్ రైస్ చెప్పారు.
ఫుడ్ టేస్ట్ గా లేదని చికెన్ కారంగా ఉందని ఒక్క ముద్ద కూడా తినలేకపోయామని కీర్తి భట్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై రివ్యూ ఇచ్చింది. జనాలు ఎందుకు ఇంతలా ఆమె ఫుడ్ కోసం ఎగబడుతున్నారో తెలియట్లేదు అని కీర్తి చెప్పింది కుమారి అంటే ఫుడ్ నచ్చలేదని వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది నెటిజన్లు వాళ్ళని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇలా రివ్యూ ఇచ్చి ఆమె పొట్ట కొట్టడం దేనికి అని కోప్పడుతున్నారు రోడ్ సైడ్ ఫుడ్ అంతకంటే బాగుంటుందా..? తెలుగు వాళ్ళు ఎక్కువ కారం తింటామని కీర్తి పోస్ట్ కి కామెంట్లు చేశారు. కర్ణాటక వాళ్ళు ఎక్కువ కారం తినరు అందుకే అలా అనిపించింది ఫుడ్ నచ్చకపోతే కర్ణాటక వెళ్లిపోండి అని దారుణంగా ఆమెను తిడుతున్నారు.
దీనిపై స్పందించిన కార్తీక్ నెటిజెన్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ అంశం మీద వీడియో చేసి పోస్ట్ చేశాడు మేము రీసెంట్గా కుమారి ఆంటీ ఫుడ్ గురించి ఒక వీడియో చేసాము దాని మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మేము తెలంగాణ వాళ్ళం ఎక్కువ కారం తింటాం మీకు కారం ఎక్కువైతే కర్ణాటక వెళ్ళండి అని అంటున్నారు. నేను కూడా రాయలసీమ వాడిని కారం ఎక్కువ తింటాం మేము చేసిన పూర్తి వీడియో చూసి అప్పుడు మాట్లాడండి అని చెప్పాడు. చికెన్ కర్రీలో కారం గురించి మాత్రమే మాట్లాడాము. ఆ రోజు మేము తిన్నప్పుడు కూరలో కారం మసాలాలు బాగా ఎక్కువ అనిపించాయి మేము రివ్యూ ఇవ్వడం వలన కుమారి అంటికి నష్టం ఏమీ జరగదు అని అన్నారు ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది