Allu Sirish : ఇండస్ట్రీలో ఉండే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి సంసార సాగరాన్ని ఈదడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలందరూ పెళ్లిపై మోజు పడినట్లు కనిపిస్తోంది. కొందరు కెరీర్ స్టార్టింగ్ లోనే చేసుకుంటుంటే.. మరికొందరు స్టార్ స్టేటస్ అందుకుని.. వయసు ముదిరిపోయాక పెళ్లితో లైఫ్ లో సెటిలైపోతున్నారు.
ఇది ఇలా ఉంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరో అల్లు శిరీష్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లి గురించిన ఊసే ఎత్తడం లేదు. తన అన్న అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కూడా అల్లు శిరీష్ తన పెళ్లిపై ఎటువంటి ప్రకటన చేయలేదు .
ఎందుకిలా చేస్తున్నాడు.. పోనీ ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నాడా.. అంటే అది కూడా లేదన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత, తన తండ్రి అయిన అల్లు అరవింద్ కూడా.. కొడుకు పెళ్ళిపై ఎందుకు శ్రద్ధ చూపట్లేదన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో అల్లు శిరీష్ కు ఓ జబ్బు ఉన్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. అయనకు ఫలానా రోగం ఉందంటూ కొందరు ఆకతాయిలు ప్రచారం చేస్తున్నారు.
ఆ కారణంగానే ఆయన పెళ్లికి నో అంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. అందుకే అల్లు అరవింద్ కూడా తన కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడట్లేదని వాదిస్తున్నారు. లేకపోతే అన్న పాన్ ఇండియా స్టార్, తండ్రి టాప్ ప్రొడ్యూసర్, కొన్ని వేల కోట్లకు అధిపతి.. అయిన ఆయనకు పెళ్లికి పిల్ల దొరకకపోవడం ఏంటన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై శిరీష్ స్పందిస్తేనే బాగుంటుంది అంటూ కోరుతున్నారు ఆయన అభిమానులు.