Dil Raju : ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో లాంటి సినిమాలతో తనదైన మార్క్ చూపించాడు.బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయినా…. శ్రీకాంత్ అడ్డాలపై ఎంతో కొంత పాజిటీవ్ ఒపీనియన్ ఉండేది. ముకుంద బ్లాక్ బాస్టర్ కొట్టకపోయినా.. కొన్ని చోట్ల శ్రీకాంత్ అడ్డాల `వావ్` అనిపిస్తాడు. అయితే… రీసెంట్ మూవీ పెదకాపు చూసిన వారు.. ఈ మూవీని తీసింది శ్రీకాంతేనా అని వండర్ అవుతున్నారు. ఓ కొత్త హీరోతో.. తన మార్క్ దాటి మరీ బయటకు వచ్చి మూవీ తీయడం.. శ్రీకాంత్ అడ్డాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
పెదకాపుని రెండు భాగాలుగా తీస్తానని రిలీజ్ కు ముందే శ్రీకాంత్ అడ్డాల అనౌన్స్ చేశారు. రిజల్ట్ చూశాక పెదకాపు- 2 వస్తుందని అనుకోవడం పొరపాటే. శ్రీకాంత్ అడ్డాలకు మరో సినిమా వస్తుందా..? అనేది అసలు క్వశ్చన్.. శ్రీకాంత్ అడ్డాల దగ్గర అన్నాయ్ అనే ఓ కథ ఉంది. అది బౌండెడ్ స్క్రిప్ట్. ఓ స్టార్ హీరో, యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ మూవీ తీద్దామనుకున్నాడు. దీన్ని గీతా ఆర్ట్స్ ఓకే కూడా చేసింది. అయితే ఇది చాలా బడ్జెట్ తో కూడుకున్న ప్రాజెక్ట్. శ్రీకాంత్ పై అంత రిస్క్ చేయడం అంటే..లాస్ లో పడటమే అని టాక్. అన్నాయ్ మూవీ విషయంలో గీతా ఆర్ట్స్ తర్జన భర్జనలు పడింది. ‘పెదకాపు’ రిజల్ట్ తో.. వాళ్లిక రిస్క్ తీసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. అటు పెదకాపు 2 పోయింది, ఇటు అన్నాయ్ పోయింది.
ఇప్పుడు శ్రీకాంత్ కు దిక్కు దిల్ రాజు ఒక్కడే. దిల్ రాజుతో శ్రీకాంత్‌కి మంచి రాపో ఉంది. శ్రీవేంకటేశ్వర మూవీ బ్యానర్లో రెండు సినిమాలు చేశాడు శ్రీకాంత్ అడ్డాల. రెండూ హిట్లే. శ్రీకాంత్ తో మరో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దిల్ రాజు సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఓ చిన్న కథతో.. దిల్ రాజు బ్యానర్లో సినిమా తీసి, తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. అయితే ఒక్కటే సమస్య. చిన్నసైజు హీరోలు సైతం అందుబాటులో లేని పరిస్థితి. పూర్తిగా కొత్త హీరోలతో కొత్తబంగారం లాంటి సినిమా చేస్తే తప్ప.. శ్రీకాంత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కదు. తన నెక్ట్స్ మూవీపై శ్రీకాంత్ అడ్డాల ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి..!