Hanuman : ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా హనుమాన్ మేనియా నడుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు మార్మోగుతోంది. ఎక్కడ చూసినా సరే ఆ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్, అందులో వాడిన వీఎఫ్ఎక్స్, తేజ ఫర్ఫామెన్స్ గురించే చర్చ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. తేజ సజ్జ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలైంది. బడా స్టార్ హీరో మహేశ్ సినిమా గుంటూరు కారం సినిమాకు కాంపిటేటివ్ గా రిలీజ్ అయిన ఈ హనుమాన్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తుంది.

కలెక్షన్స్ పరంగా ఎన్ని కోట్లు అన్న మ్యాటర్ పక్కన పడితే.. కొన్ని వేల కోట్ల జనాల మనసులకు దగ్గరైంది. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు . వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, రోహిణి, గెటప్ శ్రీను ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. కాగా ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ.. హీరో తేజ సజ్జా అక్కగా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కోసం ముందుగా సీనియర్ హీరోయిన్ ప్రియమణిని అప్రోచ్ అయ్యారట. కానీ ఆమె పాత్ర చిన్నగా ఉందంటూ రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ రోల్ లో వరలక్ష్మీని చూస్ చేసుకున్నారు మేకర్స్. ఏ మాటకు ఆ మాటే లాస్ట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ పండించిన సెంటిమెంట్ అదిరిపోయింది. ఈ పాత్రకు ఆమెనే సరైన న్యాయం చేసిందంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

గుంటూరు కారంకి ఒకరోజు ముందు అంటే శుక్రవారం రిలీజైన తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ ‘హనుమాన్’ పాన్ ఇండియాగా రిలీజైంది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టకపోయినా సినిమాపై పాజిటివ్ టాక్ తో థియేటర్ల సంఖ్యను పెంచుకునే పనిలో ఉంది. హనుమాన్ అన్నిభాషల్లో మొదటిరోజు రూ.7.56 కోట్లు వసూలు చేసింది. తెలుగులో రూ.5.50 కోట్లు వసూళ్లు కాగా హిందీలో రూ.2 కోట్లు.. మిగిలిన భాషల నుండి రూ.0.06 కోట్లు వసూలైంది.