Aadikeshava : ఉప్పెన వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి. మొదటి సినిమా ఇచ్చిన ఊపుతో వైష్ణవ్ తేజ్ సరైన ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ వెళ్లుంటే ఆయనకీ కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్స్ హిట్స్ పడేవి, మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో అయ్యేవాడు.

అంత రేంజ్ కచ్చితంగా వచ్చి ఉండేది. కానీ అది జరగలేదు. ఇక మాస్ హీరో గా ట్రై చేస్తూ రీసెంట్ గా ఆయన నుండి వచ్చిన ‘ఆదికేశవ’ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకొని, కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కనీసం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు అంటే, ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమాని తొలుత వైష్ణవ్ తేజ్ తో చెయ్యాలని అనుకోలేదట. అదే మెగా ఫ్యామిలీ లో ఉన్నటువంటి వరుణ్ తేజ్ తో చెయ్యాలని అనుకున్నారట. కానీ వరుణ్ తేజ్ కి ఫస్ట్ హాఫ్ నచినప్పటికీ, సెకండ్ హాఫ్ ఓవర్ వయోలెన్స్ ఉంది, ఈ సినిమా నాకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేసాడట. అప్పుడు ఈ కథ వైష్ణవ్ తేజ్ వద్దకు చేరింది.

ఈ సినిమాతో ఒక మంచి కమర్షియల్ ఇమేజి వస్తుందని అనుకున్నాడు కానీ, అది ఇలా రివర్స్ అవుతుందని మాత్రం ఊహించలేకపోయాడు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ ని తెచ్చిపెట్టింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి దాదాపుగా 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని, క్లోసింగ్ లో 8 కోట్ల రూపాయిలు నష్టం తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు.