Pooja Hegde : ఏంటి పూజా హెగ్దేను సల్మాన్ ఖాన్ వాడుకొని వదిలేశాడా.. ఇప్పుడు ఫోన్ చేసినా పట్టించుకోట్లేదా ?

- Advertisement -


Pooja Hegde : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా సంపాదించుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ముకుంద సినిమా తీసినా అమ్మడికి కలిసిరాలేదు. దీంతో బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ హృతిక్ రోషన్ మొహంజొ దారో చిత్రంలో నటించినా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో దాదాపు మూడేళ్లు గ్యాప్ వచ్చింది. తర్వాత అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. దీంతో తన రాత మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. చాలామంది క్రేజ్ రాగానే అన్నం పెట్టిన టాలీవుడ్ ఇండస్ట్రీని విమర్మిస్తుంటారు. ఇప్పుడు పూజ హెగ్డే పరిస్థితి కూడా అలాగే మారింది. పవన్, మహేష్ తో రెండు సినిమాలకు ఒప్పుకున్నట్లు చేసి రిజెక్ట్ చేసిందట.

Pooja Hegde

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి కీసికా బాయ్ కిసి కీ జాన్ అనే చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ టైంటో సల్మాన్ ఖాన్ తో మంచి సన్నిహిత్యం బాగా పెంచేసుకుంది. ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ నువ్వు బాలీవుడ్ మెటీరియల్‎వి ఎంతకాలం పాటు సౌత్ ఇండస్ట్రీలోనే ఉండిపోతావ్.. నా మాట విని ఇక్కడికి వచ్చేసేయ్. నేను చూసుకుంటాను అని చెప్పాడట. గతంలో ఎంతో మంది హీరోయిన్లను స్టార్లుగా మార్చిన సల్మాన్ ఖాన్ ఆ మాట చెప్పడంతో పూజా హెగ్డే ఆనందంతో ఇక్కడ టాలీవుడ్ హీరోల సినిమాలకు నో చెప్పిందట. కానీ ఇప్పటివరకు ఆమెకు సల్మాన్ ఒక్క ఆఫర్ కూడా ఇప్పించలేదట. కనీసం ఫోన్ చేసినా ఎత్తడం లేదట. దీంతో సల్మాన్ ను నమ్మి మోసపోయానని ఆమె బాధపడుతుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here