ROBINHOOD : ‘రాబిన్ హుడ్ ‘ లో హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్.. మళ్ళీ రిస్క్ చేస్తున్నాడే..

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – వెంకీ కుడుమల కాంబోలో తెరకేక్కుతున్న రెండో సినిమా ‘రాబిన్ హుడ్ ‘.. గతంలో వీరిద్దరూ కలిసి భీష్మా సినిమాలో నటించారు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో మళ్ళీ ఇప్పుడు భీష్మా డైరెక్టర్ తో రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు..

తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. మొదట ఈ సినిమాకు హీరోయిన్ గా రష్మికను అనుకున్నారట.. రష్మిక డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి రష్మిక తప్పుకోవడంతో సినిమాకు హీరోయిన్ శ్రీలీలా పేరు వినిపించింది. దానికి తగినట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

- Advertisement -

ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా…. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో “భీష్మ” చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ హిట్ అయింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో “రాబిన్ హుడ్” అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక ఈ సినిమాను డిసెంబర్ 20 సినిమాను రిలీజ్ చెయ్యనున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here