ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటు తెర మీద అటు జనాలతో మమేకమవుతూ కోట్లాది మంది అనుమానులను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ వృత్తిపరంగా చాలా కీర్తిని తెచ్చుకున్నాడు. కానీ పవన్ వ్యక్తిగత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫస్ట్ చేసుకున్న ఇద్దరు భార్యలకు డివోర్స్ ఇచ్చిన పవన్ ప్రస్తుతం అస్ట్రేలియాకు చెందిన మూడవ భార్యా అన్నాలెజెనోవాతో కలిసి జీవిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

పవన్ తన ముగ్గురు భార్యల కంటే ముందే మరో అమ్మాయిని ప్రేమించాడట అదే వార్త వైరల్ అవుతోంది. కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవర్ స్టార్ తన జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయాలను పంచుకున్నాడు. అలాగే కొన్ని సిని ఇండస్ట్రీలో విషయాలను సైతం షేర్ చేసుకున్నాడు. పవన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘నేను ఇండస్ట్రీకి రాకముందు చెన్నైలో కంప్యూటర్ క్లాస్ కి వెళ్లే వాడిని. ఆ సమయంలో అక్కడ ఒక అమ్మాయిని చూశాను. తాను చాలా అందంగా ఉంది. వెంటనే ఆమెను చాలా ఇష్టపడ్డాను. అందరూ ఆ అమ్మాయిని పడేయడానికి చాలా ట్రై చేసే వారు. కానీ ఆమె వాళ్లెవరితే మాట్లాడకుండా కేవలం నాతో మాత్రమే మాట్లాడేది. అది చూసి నా ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఓ సారి టైం చూసి ప్రపోజ్ చేయ్ అని సజెస్ట్ చేశారు. దాంతో ఓ రోజు పాత కార్ క్లీన్ చేసుకుని సిటీ అంత తిప్పి ఒకచోట ఆగి ఐ లవ్ యూ చెప్పాను. అది విన్న ఆ అమ్మాయికి ఫుల్ గా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్.. నువ్వెంత నీ వయసెంత అని తిట్టి పడేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం స్వయంగా పవన్ చెప్పడంతో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
