తెలుగు స్టార్ హీరోయిన్ Samantha గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ ఫెమస్ అవుతుంది.. ఇక తాజాగా ఈ అమ్మడు శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా అనుకున్న టాక్ ను అందుకోలేదు..పౌరాణిక కథ తో ఆ సినిమా తెరకేక్కింది..గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో సమంత టైటిల్ రోల్ ను పోషించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్’గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు సమంత విదేశాల్లో బిజీగా ఉంది..

స్టైలిష్ లుక్ లో కనిపించి అందరికి షాక్ కు గురి చేసింది..లండన్‌లో జరిగిన సిటాడెల్ మూవీ ప్రీమియర్‌లో ఆమె రూ. 65,000 ఖరీదు చేసే అద్భుతమైన విక్టోరియా బెక్‌హామ్ క్రోచెట్ ప్యాచ్‌వర్క్ స్కర్ట్ ధరించి కనిపించింది.అయితే, ఈ డ్రెస్సుకు తగ్గట్టుగా సమంత బల్గారీ డైమండ్ జ్యువెలరీతో మెరిసింది. ఆమె మెడలో ధరించిన స్నేక్ నెక్‌పీస్ ధర రూ. 2.9 కోట్లు ఆమె చేతికి ఉన్న స్నేక్ బ్రాస్లెట్ రూ. 2.6 కోట్లకు పైగా ఉందని సమాచారం..సమంత ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత…

ఈవెబ్ సిరీస్ ప్రస్తుతం లండన్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. అందులో భాగంగా సమంత తాజాగా లండన్ నుంచి కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది..సమంత యువ హీరో వరుణ్ ధావన్‌తో రొమాంటిక్‌గా పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..గతంలో ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన వీడియోను సమంత షేర్ చేసిన సంగతి తెలిసిందే..ఈ యాక్షన్ సీన్స్‌ను హలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యూనిక్ బెన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన సమంతకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు…ఇద్దన్నా సామ్ కు మంచి సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి..