Actress Poorna : హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అల్లరి నరేష్ సరసన సీమ టపాకాయ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాలలో అతిథి పాత్రలను సైతం చేసింది. మరికొన్ని సినిమాలలో పూర్ణ ఇంపార్టెంట్ పాత్రలో నటించి అదరగొట్టింది. ఇటీవల ఆమె పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతుంది. ఇటీవల ఆమె నటించిన సినిమా డెవిల్. ప్రముఖ డైరెక్టర్ మిస్కి సోదరుడు సవరకట్టి చిత్రం సేమ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న తెరపైకి వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే మీడియా ఈవెంట్ లో మాట్లాడిన చిత్ర బృందం… సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చాలా ఓపికగా మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది .
ఇదే మూమెంట్లో దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ… తనకు సినిమా అంటే చాలా ఇష్టమని.. అందుకే సినిమాలను డిఫరెంట్ డిఫరెంట్ గా తీస్తానంటూ చెప్పుకొచ్చారు. పూర్ణ మాట్లాడుతూ డెవిల్ తనకు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుందని ధీమా వ్యక్తం చేసింది. సంగీత దర్శకుడు మిషిన్ మాట్లాడుతూ సినిమా గురించి చెప్పడమే కాకుండా చిత్రంలో నటించిన పూర్ణ అద్భుతంగా నటించారు అని .. నాకు ఆమెకు ఏదో ఉందంటూ పుకార్లు రాస్తున్నారు. అదంతా ఫేక్ అని ఆమె నాకు తల్లి లాంటిది అని.. వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాటలు విని పూర్ణ స్టేజ్ పైనే భోరున ఏడ్చేసింది.