Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానం సంపాదించుకుంది. అంతే కాకుండా తన డ్యాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో అతియోశక్తి లేదు. అయితే ఈ అమ్మడు సూపర్ హిట్ సిరీస్ లస్ట్ స్టోరీకి సీక్వెల్‌గా.. తెరకెక్కిన ‘లస్ట్ స్టోరీ 2’ సిరీస్‌లో తన ప్రియుడు విజయ్ వర్మకు జోడీగా నటించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. అప్పటి వరకు తమన్నాను అలా చూసింది లేదు. ఈ సిరిస్ తో తమన్నా క్రేజ్ మరింత పెరిగింది.
ఆ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకు ఈ బ్యూటీ హాట్ హాట్ కామెంట్స్ చేసింది. బోల్డ్ గా నటిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది.. లస్ట్ స్టోరీస్ సీజన్ 1 చూశాక తన అభిప్రాయం మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఆడియన్స్ కూడా ఇలాంటివే చూస్తున్నారని ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది. అలాగే ఇలాంటి సిరీస్‌లు, సీన్లు చూసేందుకు సిగ్గు పడే ధోరణి నుంచి కాలంతో పాటు అందరూ మారే స్టేజ్‌కి వచ్చారంటూ తమన్నా చెప్పుకొచ్చారు. తనను జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాగే తనను తాను స్ర్రీన్ ప్రజెంట్ చేసుకోవడం కూడా నటిగా నాకు అవసరమే అని తెలిపారు.
అంతేకాదు ఇప్పటి వరకు తాను బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సీన్లకు ఓకే చెప్పలేదు.. కానీ ఇవి కూడా పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని రిమైనింగ్ సీన్స్ లాగే ఇవి కూడా సన్నివేశాలు మాత్రేమ అని లేట్ గా తెలుసుకున్నా అని అన్నారు. దానికితోడు ‘లస్ట్ స్టోరీస్ 2’లో బోల్డ్ సీన్స్‌లో నటించేటప్పుడు తను భయం, టెన్షన్ పడలేదన్నారు. ఎందుకంటే తన లవర్ విజయ్ వర్మ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కాస్త సిగ్గుపడుతూ చెప్పింది తమన్నా. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.