Salaar : ప్రస్తుతం ఎంతో ఉత్కంఠభరిత నేపథ్యం లో కొనసాగుతున్న ఒన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో మన భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతూ, కప్ కొట్టడమే లక్ష్యం గా ముందుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న న్యూజిల్యాండ్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లో కూడా చారిత్రాత్మక విజయం సాధించి ఫైనల్స్ లో తలపడనుంది. రేపు జరగబొయ్యే సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారితో ఫైనల్స్ లో తలపడనుంది భారత్.

ఇదంతా పక్కన పెడితే ఇండియా వరల్డ్ కప్ కొడితే కచ్చితంగా ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ‘సలార్’ చిత్రానికి ఇండియా కప్ కొట్టడానికి మధ్య లింక్ ఏమిటి అని మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు. దీనికి అద్భుతమైన కారణం సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్, అది ఇప్పుడు వైరల్ గా మారింది.

విషయం ఏమిటంటే ప్రభాస్ హీరో గా నటించిన ‘సాహూ’ చిత్రం 2019 వ సంవత్సరం లో విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అదే ఏడాది లో ఇండియా ఒన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో సెమీస్ దాకా అడుగుపెట్టి ఓడిపోయింది. అది మన ఇండియన్స్ కి ఎంతో బాధకి గురి చేసిన విషయం. ఈ ఏడాది భారత్ టీం బౌన్స్ బ్యాక్ అయ్యింది అని, అలాగే హీరో ప్రభాస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అభిమానులు కోరుకున్న విధంగా నిజంగా జరిగితే, బాక్స్ ఆఫీస్ వద్ద మన టాలీవుడ్ కి మరో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా వచ్చినట్టే. అలా జరగబోతుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే. సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడాల్సి వచ్చింది.
