Anupama : ప్రస్తుతం ఇదే వార్త ఇటు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చనీయాంశం అవుతోంది. అంతే కాకుండా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు గురించి ఎంత చెప్పకున్నా అది తక్కువే అవుతుంది. పేరుకి మలయాళ కుట్టి అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. మంచి మంచి సినిమాలో నటించి ట్రెడిషనల్, అటు గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.

ఎన్నో హిట్ సినిమాల్లో నటించినటువంటి అనుపమ పరమేశ్వరన్ కు బడా హీరోలు ఛాన్స్ లు ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లు అరవింద్.. అనుపమ పరమేశ్వరన్ ని తన కూతురిగా అభివర్ణించాడు. “ఆ అమ్మాయి చాలా బాగా నటిస్తుంది అని ..చాలా పద్ధతిగా ఉంటుంది అని.. చాలా డెడికేషన్ గల వ్యక్తిగా కీర్తించాడు. అంతటితో ఆగకుండా ఆ అమ్మాయి లాంటి కూతురు నాకుంటే బాగుండేది అని ఆశపడుతున్నాను”. అన్నారు

ఆ విషయం లో అనుపమ ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు. అల్లు అర్జున్ – అనుపమ పరమేశ్వరన్ కాంబోలో సినిమా రావాలని మేము అనుకుంటుంటే.. మీరేమో అనుపమ.. అల్లు అర్జున్ కు చెల్లిని చేసేశారు. ఇక వాళ్ళిద్దరిని పెట్టి ఏ దర్శకుడు కూడా సినిమా తీయడానికి ముందుకు రాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అనుపమ లో చాలా టాలెంట్ ఉంది. కానీ ఎందుకో బడా హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు.