మూవీ మొఘల్ రామానాయుడి మనవడిగా లీడర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రానా. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తన నటనతోనే అందరి మన్ననలు అందుకున్నారు రానా.

భల్లాలదేవగా ప్రపంచ స్థాయిలో పరిచయమయ్యారు. ఇటీవల వెంకటేష్‌తో కలిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. రానా తొలిసారిగా బాబాయి వెంకటేష్‌తో కలిసి నటించాడు. ఇందులో చాలా వరకు బోల్డ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రానా తన భార్య మిహికా బజాజ్‌ని చాలా ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. మొన్న లండన్ ట్రిప్ కి వెళ్లి అక్కడి నుంచి ఫోటోలు దిగి షేర్ చేశారు. మోడ్రన్ డ్రస్ లో ఆమె దిగిన ఫోటోలను చూసిని వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

నిజానికి మిహికా బజాజ్ కు ఫ్యాషన్ సెన్స్ చాలా ఎక్కువ. ఆమె అందమైన ఫోటోలు చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. హాఫ్ షోల్డర్ టాప్ మినీ డ్రెస్ లో ఆమె చాలా అందంగా ఉంది. హీరోయిన్ కి రానా భార్య ఏ మాత్రం తీసుకుపోని విధంగా ఉందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.