తెలుగు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. పవన్ తో విడిపోయాక సోషల్ మీడియా పాపులర్ అయ్యింది.. తాజాగా సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.. తనకు గాయాలు తగిలినట్లు ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజాగా రేణు దేశాయ్ గాయపడ్డారు. ఆమె కాలి వేళ్లకు తీవ్ర గాయాలు అయినట్టు చెప్తుంది.. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చయబోతోంది . ఈసినిమాలో రవితేజ సిస్టర్ క్యారెక్టర్ లో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే రేణు దేశాయ్ చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తనకు తన పిల్లలకు సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తనను ఎవరైనా అంటే వారికి ఘాటుగా బుద్ది చెప్పేది..
ఎప్పుడూ తన పిల్లల ఘనతలను ముఖ్యంగా అఖీరా నందన్ కు సంబంధించిన అన్ని విషయాలను ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. రీసెంట్ గా అకీరానందన్ వర్కౌట్స్ వీడియోఒకటి పోస్ట్ చేసిన రేణుదేశాయ్.. తనకు చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్ కూడా పెట్టింది.. ఇకపోతే తాజాగా రేణు దేశాయ్ పెట్టిన మరొక పోస్ట్.. తన అభిమానులకు కంగారు పెట్టింది. మొన్న ఏమో తన కాలికి తీవ్రమైన గాయం అయ్యిందని..
దాంతో తన కాలి మూడు వేళ్ళు చాలా దెబ్బతిన్నాయని ముఖ్యంగా మరొక వేలు చితికిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు గాయం అయిన విషయాన్ని తెలియచేస్తూ ఒక పోస్ట్ చేశారు…అంత గాయాలు తగిలిన బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించడం పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. అంతేకాదు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి పోస్ట్ వైరల్ అవుతుంది.. అసలు గాయాలు ఎందుకు తగిలాయో చెప్పలేదు..