Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. తను ఏ భాషలో చేసినా.. ఏ పాత్ర పోషించినా అందులో ఒదిగిపోయి నటిస్తుంటారు. ఈ మధ్యకాలంలో కాస్త నెమ్మదించినా గతంలో ఆయన లేకుండా పెద్ద సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఒకానొక టైంలో హీరోల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రమే. ప్రస్తుతం అడపాదప సినిమాలలో నటిస్తూ రాజకీయాల పరంగా కూడా నిలదోక్కుకోవడానికి ఆయన పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బీజీపీ పై ఎప్పుడూ విరుచుకుపడుతుంటారు. రెండేళ్ల క్రితం మా ఎన్నికలలో నిలబడి మంచి విష్ణు చేతిలో చాలా ఘోరంగా ఓడిపోయారు.
మెగా ఫ్యామిలీ సపోర్టు పుష్కలంగా ఉన్నప్పటికీ మా ప్రెసిడెంట్ కాలేకపోవడం ఆశ్చర్యం అనిపించింది. మంచు విష్ణు ప్రెసిడెంట్ అయ్యాక గెలుపు ఓటములు సర్వసాధారణమే.. ప్రెసిడెంట్ ని సైతం హామీలు నెరవేర్చకపోతే అడిగే హక్కు ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అప్పుడు చెప్పనట్లుగానే మంచు విష్ణు పైన నిరంతరం ఫైర్ అవుతున్నారు. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయి రెండేళ్లు అవుతున్న.. ఆయన పనితీరు సున్నా అని తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రెండేళ్లు అయిపోయినా ఇంత వరకు ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదంటూ విమర్శించారు.
తను గెలిచిన తర్వాత మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు సొంత భవనం నిర్మిస్తామని చెప్పి.. గెలిచి కూడా ఏం చేయలేదన్నారు. దీనిపై విష్ణు ని ఎన్నుకున్న సభ్యులందరూ కూడా ఒకసారి ఆలోచించాలన్నారు. బోగస్ ఓట్లు అలాగే బయటి నుంచి వచ్చిన చాలామంది ఓట్లు వేయడం వల్ల ఆయన గెలిచారని తెలిపారు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదంటూ ఫైర్ అయ్యారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ వ్యాఖ్యలను ఏకీభవిస్తుండగా.. మరికొంతమంది ఈ మాత్రం ఖండిస్తున్నారు. దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.