Pawan Kalyan – Venkatesh : ఎంత మంచి స్నేహితుల మధ్య అయినా డబ్బు విషయం లో విబేధాలు రావడం సర్వసాధారణం. మన నిజ జీవితం లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూసి ఉంటాము, అలాగే సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ కి మధ్య డబ్బు విషయం లో చిన్న గొడవ అయ్యింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో ‘గోపాల గోపాల’ అనే సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇందులో పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించగా, వెంకటేష్ ఆయన భక్తుడి పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చింది . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ కాంబినేషన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కనిపించడు, కేవలం ఇంటర్వెల్ సన్నివేశం లో మాత్రమే కనిపిస్తాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు అంతే. ఆయన అందుకోసంగా 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు. ఆ 20 రోజులకు ఒక రెమ్యూనరేషన్ అనుకోని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. 20 రోజులకు ఒక రెమ్యూనరేషన్, 20 రోజులు దాటితే అదనపు రెమ్యూనరేషన్ అని ఆ అగ్రిమెంట్ సారాంశం. అయితే సినిమా షూటింగ్ జరుగుతూ పోతుండగా, పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించి అదనంగా మరో 15 రోజుల డేట్స్ కావాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడు కానీ, అగ్రిమెంట్ ప్రకారం ఆ చిత్ర నిర్మాత సురేష్ బాబు అదనపు రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. దీని వల్ల పవన్ కళ్యాణ్ మరియు సురేష్ బాబు మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టు, మధ్యలో వెంకటేష్ కలగచేసుకుంటే ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ కి స్వల్ప వాగ్వివాదం జరిగింది. గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సురేష్ బాబు ని ఈ గొడవ విషయం అడగగా, అదేదో చిన్న అపార్థం అండీ, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చాడు.