SR NTR : టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించారు. ఆయన మరణానంతరం ఆయన గురించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే విశ్వనాథ్ ను గుర్తు చేసుకుంటూ చాలా మంది తమ మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ్, దివంగత నటుడు నటసార్వభౌమ ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు రావడంతో 14 ఏళ్లుగా ఇద్దరూ మాట్లాడుకోలేదని తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య గొడవ ఏంటి.. ఎందుకు మాట్లాడుకోలేదో చూద్దాం. వీరిద్దరూ కాలేజీ చదివే రోజుల్లో ఎన్టీఆర్.. విశ్వనాథ్ గారికి సీనియరట. అలా వారిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉండేదట. ఎన్టీఆర్ చదువు పూర్తయిన వెంటనే సినిమాల్లోకి అడుగుపెట్టాడు. విశ్వనాథ్ కూడా చదువు పూర్తి చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వీరిద్దరి బంధంతో వీరి కాంబోలో చాలా సినిమాలు కూడా తెరకెక్కాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా బాల్య స్నేహితులు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య గొడవ జరిగింది.

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ సన్ గ్లాసెస్ పెట్టుకుని లొకేషన్ కు వస్తే.. అది సెంటిమెంట్ సీన్ అవుతుందని సన్ గ్లాసెస్ తీసేయమని విశ్వనాథ్ కోరాడు. అయితే ఎన్టీఆర్ అదే సన్ గ్లాసెస్ తో నటించాడు. ఈ సీన్ షూటింగ్ టైమ్ లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై విశ్వనాథ్‌పై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుకు లోకం దాసోహం అనే సినిమా కంటే ముందు విశ్వనాథ్ దర్శకత్వం వహించాల్సిన ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉండగా.. ఆ సినిమా నుంచి విశ్వనాథ్ తొలగించి యోగానంద్‌ను దర్శకుడిగా తీసుకున్నాడట ఎన్టీఆర్. ఇలా ఈ గొడవల కారణంగా వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడి 14ఏళ్ల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని.. అయితే బాలకృష్ణ హీరోగా నటించిన జననీ జన్మభూమి మూవీ షూటింగ్ టైంలో వీరిద్దరూ తిరిగి మాట్లాడుతున్నారని తెలుస్తోంది.