Charmy Kaur : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన అందం, అభినయం ఆమె సొంతం. తన నటనతో ఎంతో మంది కుర్రకారును ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మంచిగా ఉండగానే ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యింది. అప్పటి వరకు మంచి క్రేజ్ సంపాదించుకుని, ఇక తన కెరీర్‌ను నెంబర్ వన్ పొజిషన్‌లో నిలబెట్టుకుంటుంది ఫర్వాలేదు అనుకునేలోపే తాను తీసుకున్న ఓ నిర్ణయం, తన జీవితాన్నే రిస్కలో పడేసింది. తన కెరీర్ నాశనం అయ్యేలా చేసిందని అభిమానులు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

‘నీకే మనసిచ్చాను’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా శ్రీ ఆంజనేయం, పొలిటికల్ రౌడీ సినిమాల్లో తన అందాలకు కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ అమ్మడు కెరీర్ మారిపోనుందని అని అనుకున్నారు. ఎందుకంటే? తర్వాత ఈ బ్యూటీకి మంగళ, మాస్, రాఖీ, లక్ష్మీ, చక్రం, పౌర్ణమి వంటి చాలా సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి.
అంతే కాకుండా మంగళ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు వరించింది. అలాంటి సమయంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతి లక్ష్మి సినిమాలో వేశ్య పాత్రలో నటించి తన నటనతో అబ్బుర పరిచింది. ఈ సినిమాలో తన నటను చూసి ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ అమ్మడు స్టార్ రేంజ్‌కు ఎదగడం ఖాయం అనుకున్నారు అందరు. కానీ అప్పుడు ఆమె తీసుకున్న ఓ నిర్ణయం తన కెరీర్‌ను నాశనం చేసిదంట.
జ్యోతి లక్ష్మి సినిమా టైంలో ఛార్మికి పూరీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి వారు డేటింగ్‌లో ఉన్నారంటూ అనేక పుకార్లు షికారు చేశాయి. అంతే కాకుండా వీరు ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం, సినిమా ఈవెంట్స్‌కు వెళ్లడంతో ఆ రూమర్స్ నిజమేనేమో అన్న అనుమానం వ్యక్తమైంది. దీంతో ఛార్మికి తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ కెరీర్ క్లోజ్ అయ్యిందంటున్నారు జనాలు.