Srikanth : హీరోయిన్ నడుము కారణంగా అట్టర్ ఫ్లాప్ అయిన శ్రీకాంత్ సినిమా అదేనా..!

- Advertisement -

Srikanth : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత స్టార్ హీరో గా ఎదిగిన నటుడు శ్రీకాంత్. ఈయన ఒకప్పుడు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏర్పాటు చేసుకున్న ఇమేజి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలా హీరో సుమారుగా రెండు దశాబ్దాలకు పైగా సక్సెస్ ఫుల్ కెరీర్ ని ఎంజాయ్ చేసి వంద సినిమాలను పూర్తి చేసుకున్న శ్రీకాంత్, ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా ఒక రేంజ్ డిమాండ్ తో ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు.

Srikanth
Srikanth

అయితే శ్రీకాంత్ తన వందవ సినిమా ‘మహాత్మా’ తన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం గా ఉండిపోవాలి అని అనుకున్నాడు. తనకి ‘ఖడ్గం’ లాంటి పవర్ ఫుల్ రోల్ ని ఇచ్చిన కృష్ణ వంశీ ని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు. మంచి స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమా ఎందుకో ఆడియన్స్ ని అలరించకలేకపోయింది.

బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. విడుదల తర్వాత ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు చెప్పారు. అందులో ముఖ్యంగా హీరోయిన్ ‘భావన’ కూడా ప్రధాన కారణం అట. మలయాళం లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన భావన తెలుగు లో గోపీచంద్ హీరో గా నటించిన ‘ఒంటరి’ చిత్రం తో మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ నటిగా భావన కి మంచి పేరు ని తెచ్చిపెట్టింది. ఇక మహాత్మా సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు కృష్ణ వంశీ చాలా మంది హీరోయిన్స్ ని సంప్రదించాడు.

- Advertisement -

కానీ చివరికి భావన ని ఎంచుకున్నాడు, ఈమెని కలిసినప్పుడు చాలా బొద్దుగా, బుగ్గలు బరువెక్కిపోయి చూసేందుకు చాలా ఆరోగ్యంగా ఉండేదట. కానీ కృష్ణవంశీ రిక్వెస్ట్ తో ఆమె వర్కౌట్స్ చేసి కాస్త బరువు తగ్గింది. కానీ నడుము మాత్రం బాగా లావుగానే ఉండిపోయింది. పాటల్లో మాటికొస్తే కృష్ణ వంశీ ఆమె బొడ్డుని టార్గెట్ చెయ్యడం వల్ల జనాలు చూడలేక సినిమా ఫ్లాప్ అయ్యింది అని అప్పట్లో ఒక టాక్ ఉండేది. వినేందుకు ఈ కారణం చాలా సిల్లీ గా అనిపించినా ఆమెకు మళ్లీ తెలుగు లో అవకాశాలు రాకపోడానికి కారణం ఇదే అని అంటుంటారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here