Waltair Veerayya : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మెగా అభిమానులకు ఎలాంటి కిక్ ని ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత చిరంజీవి పని ఇక అయిపోయింది అని అనుకుంటున్న సమయం లో ఈ చిత్రం విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు గా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలు కాకుండా టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిల్చింది ఈ చిత్రం.నేటికీ ఈ సినిమా విడుదలై 30 రోజులు పూర్తి చేసుకుంది, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూ ఆడియన్స్ కి మొట్టమొదటి ఛాయస్ గా నిల్చింది ఈ చిత్రం.

మరో విశేషం ఏమిటంటే నిన్న విడుదలైన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా జనాలు ఈ వీకెండ్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారు.నిన్నటి ట్రెండ్ అలాగే ఉండింది, నేటి ట్రెండ్ కూడా అలాగే ఉంది.ఆదివారం రోజు కూడా ఈ సినిమాకి అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.30 వ రోజు అనగా ఈరోజు ఈ చిత్రానికి 50 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.చూస్తూ ఉంటే ఈ సినిమాకి లాంగ్ రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

50 రోజుల సెంటర్స్ కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓటీటీ కాలం లో ఒక సినిమాకి ఈ రేంజ్ లోన్ రన్ రప్పించడం అంటే చిరంజీవి ని మెగాస్టార్ అని ఎందుకు అంటారో నేటి తరం వాళ్లకి కూడా అర్థం అవుతుంది.. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో మెగాస్టార్ చిరంజీ తదుపరి చిత్రం ‘భోళా శంకర్‘ కి కూడా బంపర్ బిజినెస్ జరుగుతుంది.. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగష్టు 11 వ తేదీన విడుదల కాబోతుందని తెలుస్తుంది.