ఒకప్పుడు సినిమాల్లోకి రావాలని కోరిక ఉండేవాళ్ళు స్టూడియోస్ చుట్టూ తిరిగి, ఎన్నో ఆడిషన్స్ ఇస్తే కానీ అవకాశాలు దక్కేవి కావు. ఆ ఆడిషన్స్ లో అవకాశం రావడమే మహా భాగ్యం అనుకోవాలి. ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో, అప్పటి నుండి టాలెంట్ ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి డ్యాన్స్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఆకట్టుకుంటూ మూవీ మేకర్స్ వీరి వైపు చూసేలా చేస్తున్నారు.
అలా సోషల్ మీడియా లో ‘వైవా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఒక రేంజ్ లో పాపులారిటీ మరియు క్రేజ్ ని దక్కించుకున్న వ్యక్తి ‘వైవా హర్ష’. అప్పట్లో యూట్యూబ్ లో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షార్ట్ ఫిలిం తర్వాత వైవా హర్ష కి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నేడు టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ లో ఒకడిగా కొనసాగాడు, ఇప్పుడు త్వరలోనే డైరెక్టర్ గా కూడా మన ముందుకు రాబోతున్నాడు.
ఇది ఇలా ఉండగా వైవా హర్ష తండ్రి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఆయన పేరు సత్యనారాయణ రావు, ఫెడరల్ బ్యాంక్ లో మ్యానేజర్ గా పని చేసాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈయన మెగాస్టార్ చిరంజీవి కి బాల్య స్నేహితుడు. వీళ్లిద్దరు కలిసి 10 వ తరగతి చదివారు. ఒకరోజు చిరంజీవి తన స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన ఒక గెట్ టూ గెథెర్ పార్టీ కి వైవా హర్ష తండ్రి సత్యనారాయణ రావు కూడా హాజరు అయ్యాడు.
రీసెంట్ గా భోళా శంకర్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గా నా బాల్య మిత్రులతో ఏర్పాటు చేసిన గెట్ టూ గెథెర్ పార్టీ లో వీళ్ళ నాన్న కూడా వచ్చాడు. మా అబ్బాయి కూడా ఇండస్ట్రీ లో ఇప్పుడు టాప్ కమెడియన్ అంటే, అవునా ఎవరూ అని అడిగాను. వైవా హర్ష అని చెప్పాడు. అప్పుడు నేను షాక్ కి గురై, ఇప్పుడు తెలుస్తుంది మీ ఇద్దరిలో పోలిక అని చెప్పాను’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.