Viswaksen : టీవి9 దేవి నాగవల్లికి విశ్వక్ సేన్.. దిమ్మతిరిగే కౌంటర్.. ఊహించని విధంగా వడ్డీతో సహా ఇచ్చేశాడు..

- Advertisement -

Viswaksen : టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే.. విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫ్రాంక్ వీడియో చేశారు. పబ్లిక్ ప్లేస్ లో పెట్రోల్ పోసుకుంటున్నట్లుగా చేసిన వీడియో అప్పట్లో తెగ హంగామా చేయడంతో.. అది పెద్ద న్యూసెన్స్ గా మారింది. దాంతో ఆ ఇష్యూ పై టీవీ 9 ఛానల్ లో డిబేట్ నిర్వహిస్తూ వరుస బ్రేకింగ్ లు వేయడంతో.. అదే లైవ్ లో డిబేట్ కి పాల్గొన్నాడు హీరో విశ్వక్ సేన్.

Viswaksen
Viswaksen

ఈ డిస్కషన్ లో భాగంగా యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్ సేన్ మధ్య మాటల తూటాలు పేలాయి.. విశ్వక్ సేన్ ముందే పాగల్ సేన్, డిప్రెషన్ పర్సన్ అని దేవి అనడంతో .. విశ్వక్ సేన్ కి కోపం వచ్చింది. నన్ను పాగల్ సేన్ అని డిప్రెషన్ పర్సన్ అనే హక్కు మీకు లేదు. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే రైట్ మీకు ఎక్కడిదని దేవికి క్లాస్ పీకాడు.

దాంతో కోపం వచ్చినా దేవి నాగవల్లి గెట్ అవుట్ మై స్టూడియో అంటూ విశ్వక్ సేన్ ని స్టూడియో నుంచి బయటకు పొమ్మన్నందుకు విశ్వక్ సేన్ కి కూడా కోపం వచ్చింది. దాంతో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్నికి కొంతమంది విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేయగా.. మరి కొంతమంది దేవి నాగవల్లికి సపోర్ట్ చేశారు . ఈ విషయాన్ని బలంగా మనసులో విశ్వక్ సేన్ నాటుకున్నాడో ఏమో.. తన కొత్త సినిమా దాస్ కామ్ కిలో టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తను ఊహించని విధంగా వడ్డీతో సహా సమాధానం చెప్పాడు..

- Advertisement -

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం దాస్ కా ధమ్కీ.. ఈ చిత్రానికి హీరో కం దర్శకుడు విశ్వక్ సెనే.. ఈ సినిమాలో హీరోయిన్ తో కార్ లో వెళ్తున్న విశ్వక్ కారు మెడికల్ షాప్ దగ్గర ఆపాల అని హీరోయిన్ ని అడుగుతాడు హీరోయిన్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్ అని అంటుంది ఎందుకు కండోమ్స్ తేవడానికి హీరో ఫన్నీగా అంటాడు. ఈ సీన్ లో హీరోయిన్ నివేత పెతురాజ్ బాడీ లాంగ్వేజ్ దేవి నాగవల్లిని పోలి ఉంటుంది . దాంతో దేవీ నాగవల్లికి విశ్వక్ సేన్ స్ట్రాంగ్ కౌంటర్ ను ఉద్దేశిస్తూ ఈ సీన్ రాసుకున్నారని అంతా అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here