Vishwak Sen : యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్టర్ గా మారి పలు సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. గతం లో ఆయన విశ్వక్ సేన్ ని హీరోగా, తన కూతురు ఐశ్వర్య ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమా ఓపెనింగ్ కి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కూడా కొట్టాడు. అంత గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అట్టకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే.

కేవలం షూటింగ్ ని ఒక రోజు వాయిదా వెయ్యమని చెప్పినందుకు అర్జున్ మీడియా ముందుకు వచ్చి, విశ్వక్ సేన్ ప్రవర్తించిన తీరుని తప్పుపట్టి ఆయనపై అనేక కామెంట్లు చేసాడు. ఈ ప్రెస్ మీట్ అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. అర్జున్ అప్పట్లో విశ్వక్ సేన్ మీద ఎన్ని కామెంట్స్ చేసినప్పటికీ విశ్వక్ సేన్ చాలా కూల్ గానే సమాధానం ఇచ్చాడు.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విశ్వక్ సేన్ దీని గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘ఆరోజు నేను సినిమా క్యాన్సిల్ చెయ్యమని అర్జున్ సార్ తో చెప్పలేదు. కేవలం ఒక రోజు వాయిదా వెయ్యమని మాత్రమే చెప్పాను, దానికే ఆయన ప్రెస్ మీట్ పెట్టి పెద్ద రచ్చ చేసాడు. నాకంటే సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి అంత ధైర్యంగా చేయగలిగాడు, అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో కి అలాగే చేసేవాడా?..ఈ సంఘటన జరిగిన ముందు రోజు కూడా ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మానాన్నలను రిక్వెస్ట్ చేసాడు.

ఈ విషయం ఎవరికైనా తెలుసా?, ఎవరికీ తెలియదు. ఇలాంటివి ఎక్కడా చెప్పరు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకే ఎక్కువ నష్టం జరిగింది. తీసుకున్న అడ్వాన్స్ కి రెట్టింపు చెల్లించాను. అయినా కానీ నేను ఏనాడూ కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. నేను అభిమానించిన హీరో ఆయన..ఆయనే అలా నా పరువు తియ్యాలనుకోవడం బాధని కలిగించింది’ అంటూ ఎమోషనల్ గా చెప్పుకున్నాడు విశ్వక్ సేన్.