ఈ సమ్మర్ లో బయ్యర్స్ కి ప్రతీ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని, భారీ లాభాలను అర్జించిన ఏకైక సినిమా సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’. హారర్ థ్రిల్లర్ గా విడుదలకు ముందు నుండే టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా, విడుదల తర్వాత ఆ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం విశేషం.
టాలీవుడ్ లో గడిచిన పదేళ్లలో కామెడీ హారర్ సినిమాలు బాగా వచ్చాయి కానీ, ఇలా పర్ఫెక్ట్ గా పూర్తి స్థాయి హారర్ థ్రిల్లర్ మాత్రం రాలేదు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దానికి తోడు ఈ సమ్మర్ కి విడుదలైన సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బోల్తా కొట్టడం తో ‘విరూపాక్ష’ చిత్రానికి బాగా కలిసొచ్చింది.ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 25 రోజులకు గాను ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఈ సినిమా విడుదలైన అన్నీ ప్రాంతాలలో అద్భుతమైన వసూళ్లను తెచ్చిపెట్టిన ప్రాంతాలు ఒకటి నైజాం, మరొకటి ఓవర్సీస్.నైజాం ప్రాంతం లో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్ లో 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత సీడెడ్ లో 5 కోట్ల 60 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 5 కోట్ల 30 లక్షల రూపాయిలను రాబట్టింది ఈ చిత్రం.
అలాగే నెల్లూరు జిల్లాలో కోటి 25 లక్షలు, గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 50 లక్షల రూపాయిలు, ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి 4 కోట్ల 50 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని విరూపాక్ష వసూలు చేసింది. అలా మొత్తం మీద ఈ చిత్రం ఇప్పటి వరకు 47 కోట్ల రూపాయిల షేర్ మరియు 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది. వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకుంటుందో లేదో చూడాలి.