విమానంలో వేశ్యగా అనసూయ.. పాటలో రెచ్చిపోయిన యాంకరమ్మ

- Advertisement -

బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన అనసూయ, వెండితెరపై కూడా ఒక రేంజ్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘విమానం’ రెడీ అవుతోంది. కిరణ్ కొర్రపాటి – జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుమతి పాత్రలో అనసూయ కనిపించనుంది. ఆమె పాత్రపై సాగే పాట కూడా ఒకటుంది. కొంత సేపటి క్రితం ఆ పాటను రిలీజ్ చేశారు . ‘సుమతీ .. సుమతీ .. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత’ అంటూ ఈ పాట సాగుతోంది.

అనసూయ
అనసూయ

ఈ చిత్రంలో అనసూయ పాత్ర పేరు సుమతి. అనసూయ వేశ్యగా నటిస్తోంది అంటూ బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ సుమతీ అంటూ సాగే లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో అనసూయ బోల్డ్ స్టిల్స్ లో కనిపిస్తోంది. నడుము, ఎద అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది. ఆమె వెంట పడే పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపిస్తున్నాడు. ‘సుమతీ.. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనితా ‘ అంటూ చరణ్ అర్జున్ అద్భుతంగా పాడారు. ఈ పాటని రాసింది, పాడింది, కంపోజ్ చేసింది సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ కావడం విశేషం.

విమానం
విమానం

అనసూయ అందాల కొలతలపైనే ఈ పాటని రాసినట్లు అర్థం అవుతోంది. రాహుల్ రామకృష్ణ కోణంలో ఈ పాట సాగుతుంది. నీ ఎత్తు పొడవు చూస్తే పుడతది మునులకైన తిక్క అంటూ ఒకరేంజ్ లో అనసూయ అందాన్ని వర్ణించారు. ఆస్తి పాస్తీ లేని గరీబోడిని నీకు వెయ్యి రూపాయలు ఎక్కడ నుంచి ఇవ్వను అంటూ రాహుల్ రామకృష్ణ వాపోతున్నట్లు ఈ సాంగ్ లో ఉంది. అంటే అనసూయ వేశ్యగా నటిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఆమె అందంపై మనసు పారేసుకున్న యువకుడిగా రాహుల్ రామకృష్ణ దొగచాటుగా అనసూయ అందం చూస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here