Vijayashanthi : లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు విజయ శాంతి. ఏ హీరోయిన్ అయినా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు చెయ్యాలంటే విజయశాంతి ని ఆదర్శంగా తీసుకుంటారు. హీరోల పక్కన అందాలను ఆరబోస్తూ రొమాన్స్ చెయ్యడమే కాకుండా, బీభత్సమైన ఫైట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు లాంటిది విజయశాంతి. ఆరోజుల్లో ఈమె సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ వంటి బడా హీరోలతో పోటీ పడేవి.
అందుకే ఈమెని అందరూ లేడీ అమితాబ్ బచ్చన్ అని పిలుస్తూ ఉంటారు. అలా పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చిన విజయ శాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చింది. అలా సుదీర్ఘ కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయ శాంతి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు చేయబోనని, నా జీవితం రాజకీయాలకే అంకితం అని చెప్పుకొచ్చింది విజయ శాంతి.
కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరో గా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో విజయ శాంతి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తానూ ఒక సినిమా చెయ్యాలంటే కథ మొత్తం తన చుట్టూనే తిరగాలి, అప్పుడే నేను ఏ సినిమాకి అయినా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అంటూ గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది విజయ శాంతి.
ఈ సినిమాలో కూడా అలాంటి పవర్ ఫుల్ పాత్ర రాబట్టే ఆమె ఒప్పుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో నటించడానికి ఆమె ఏకంగా నాలుగు కోట్ల రూపాయిలు డిమాండ్ చేసిందట. ప్రస్తుతం టాప్ లీడింగ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. అలాంటిది ఆమె ఇంత మొత్తం డిమాండ్ చెయ్యడం నిజంగా షాక్ అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఆమెకి ఇస్తామన్న ఈ భారీ పారితోషికం కారణం గానే సినిమాల్లో నటించను అని మాటిచ్చి మళ్ళీ నటించడానికి ఒప్పుకుంది అంటూ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.