Tammanah : హైదరాబాద్‌కు చెందిన విజయ్‌వర్మ బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్న ఆయన విభిన్న పాత్రల్లో నటించాలని ఉందన్నారు. ‘కెరీర్ ప్రారంభంలోనే నాకు మంచి ప్రాజెక్ట్‌లో అవకాశమొచ్చింది. మరికొన్ని ఫొటోలు పంపమని ఫోన్ చేశారు. కొన్ని రోజులకు నన్ను ఆ ప్రాజెక్ట్‌లో నుంచి తీసేస్తున్నట్లు తెలిపారు.
ఆ దర్శకుడి జ్యోతిష్యుడికి నేను నచ్చలేదని అందుకే తీసేసినట్లు నాకు తర్వాత కొన్ని రోజులకు తెలిసింది. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. అప్పుడు బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ధైర్యం చెప్పారు. చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొవాలని ఆయన నాతో అన్నారు. ఏదీ అంత సులభంగా రాదని తెలిపారు. ఆయన మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఎప్పటికైనా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా. నా రోజు కోసం ఎదురుచూశాను. అందిన అవకాశాలను వినియోగించుకుని నటుడిగా ఎదిగాను’ అని చెప్పారు.
అర్థిక ఇబ్బందులు తీరడం కోసం కొన్నిసందర్భాల్లో ఇష్టం లేకపోయినా చిన్న పాత్రల్లో నటించినట్లు తెలిపారు. ఆ సమయంలోనే ‘మాన్సూన్ షూటౌట్’లో అవకాశం వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయన్నారు. ఇక 2008లో ఒక షార్ట్ ఫిల్మ్‌తో నటుడిగా పరిచయమైన ఆయన ‘చిట్టగాంగ్’తో తొలిసారి వెండితెరపై కనిపించారు. అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో నటించిన ‘పింక్’తో ఆకట్టుకున్నారు.