Tamanna: సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు తమన్నా..శ్రీ అనే చిత్రంతో మంచు మనోజ్ సరసన నటించింది.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది..ఆ తర్వాత శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకేక్కిన హ్యాపీ డేస్ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమా తో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.. అలా ఒక్కో సినిమాతో ఒక్కో టాక్ ను అందుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇకపోతే తమన్నా గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే తమన్నా ప్రగ్నెంట్ అని..ఇందులో నిజమేంత ఉందో తెలుసుకుందాం..

వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అతి తక్కువలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అయితే అప్పట్లో ఈమె తమిళం లో ఒక ప్రముఖ స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపినట్టు వచ్చిన ఒక వార్త ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమన్నా అతనితో ప్రేమాయణం నడపడం వల్ల వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురైందని, మానసికంగా కూడా బాగా దెబ్బతినింది అని అంటుంటారు..ఆ హీరోతో రిలేషన్ లో ఉండటంతో గర్భం దాలచ్చిందని వార్తలు వైరల్ అయ్యాయి.. అతనితో విడిపోయిన తర్వాత తమన్నా అవాషన్ కూడా చేయించుకుందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు కానీ, ఈ రూమర్ ఇప్పటికీ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది.దీంతో ఆమె ఫ్యాన్స్ ఛీ.. ఛీ తమన్నా ఇలాంటి తప్పు చేస్తుందని అనుకోలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

అయితే ఇప్పుడు మరో హీరోతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది..ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా వీళ్లిద్దరు పార్టీ లో కిస్ చేసుకుంటూ పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అప్పటి నుండి వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు.. డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చేవి. ఈ వార్తలపై అటు విజయ్ వర్మ కానీ, ఇటు తమన్నా కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం తో ఇది నిజం అని అభిమానులు కూడా నమ్ముతున్నారు… ఇటీవల వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళుతున్నారు..మరి దీనిపై ఎప్పుడూ క్లారిటి వస్తుందో చూడాలి.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టు లలో చేస్తుందని తెలుస్తుంది..