Vijay Thalapathy : రజనీ కాంత్ తర్వాత కోలీవుడ్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్. అయనను ముద్దుగా అభిమానులక దళపతిగా పిలుచుకుంటారు. ఆయన ఎంత స్టార్ గా ఎదిగినా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అందుకు ఆయనకు టాలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మాస్టర్ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని దసరాకు ప్రేక్షకుల కోసం రానుంది.ఇప్పటికే రిలీజైన టీజర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తర్వాత విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత విజయ్ ఒక సంచలన ప్రకటన చేయనన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సమాచారం ప్రకారం వెంకట్ ప్రభు సినిమా తర్వాత విజయ్ మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఎప్పటినుంచో విజయ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విద్యార్థులతో మీటింగ్ పెట్టి వారిని అభినందించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు విజయ్ రాజకీయ ఎంట్రీ ని ఖండించిన అభిమానులు సైతం ఈ ఒక్క సంఘటనలతో ఆయన పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అని స్ఫష్టం చేశారు. వెంకట్ ప్రభు సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు, మూడేళ్లు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అందుకు కారణం లేకపోలేదు. తమిళనాడులో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ ఇప్పటికే తన వ్యూహాలను రచిస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో విజయ్ తన అభిమానులకు ఏ పార్టీకి ఓటు వేయాలో సూచించాడు. పార్టీ గెలిచిందని, రాజకీయ నేతలు గెలుపుపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, తాను కొత్త పార్టీ పెట్టనని, అంతకంటే పెద్ద సమస్య లేదని ఆయన అన్నారు. దీంతో తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి విజయ్ పార్టీ పెడుతున్నాడా లేక సపోర్ట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు విజయ్ సినిమాలకు మూడేళ్లు గ్యాప్ ఇవ్వడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.