టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో విజయ్ దేవరకొండ మొదటి స్థానం లో ఉంటాడు. ఇతగాడికి అమ్మాయిలలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ప్రతీ అమ్మాయి మహేష్ బాబు లాంటి అందగాడు నాకు మొగుడుగా వస్తే బాగుండును అని అనుకునేవారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ విజయ్ దేవరకొండ సొంతం.
![విజయ్ దేవరకొండ](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/08/image-732-1024x768.png)
అందుకే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే ఆయా స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు. హీరోయిన్స్ లో కూడా విజయ్ దేవరకొండ అంటే చాలా మందికి క్రష్. తమన్నా, జాన్వీ కపూర్, రాశి ఖన్నా ఇలా ఎంతమంది విజయ్ దేవరకొండ ని తమ క్రష్ గా పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. కోట్లాది మంది కుర్రాళ్ళు అభిమానించే హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే అంతలా మోజు చూపిస్తున్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/08/image-734-1024x768.png)
అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలు చేసిన రష్మిక తో చాలా కాలం నుండి ప్రేమలో ఉన్నాడని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మా మధ్య ఏమి లేదని అంటూనే, ప్రైవేట్ పార్టీలకు, ఫారిన్ టూర్స్ కి కలిసి వెళ్లడం వంటివి చేస్తూనే ఉన్నారు.
![Vijay deverakonda rashmika mandanna](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/08/image-735-732x1024.png)
ఇక కాసేపటి క్రితమే విజయ్ దేవరకొండ కూడా తన జీవిత భాగస్వామిని అతి త్వరలోనే పరిచయం చేయబోతున్నాను అంటూ ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టుకున్నాడు. ఈ ఫోటో లో విజయ్ దేవరకొండ , ఎవరో అమ్మాయి చెయ్యి పెట్టుకోవడాన్ని మనం గమనించొచ్చు. ఇది కచ్చితంగా రష్మిక చెయ్యి అని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.