Rashmika And Vijay Devarakonda : చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక మధ్య ప్రేమాయణం నడుస్తుందని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ప్రస్తుతం ఉంటుందని ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. వీళ్లిద్దరు కలిసి ఉన్నట్టు సోషల్ మీడియా లో ఇది వరకు ఎన్నో ఫోటోలు కూడా వచ్చాయి.
కానీ వీళ్లిద్దరు మాత్రం ఇంకా వీళ్ళ రిలేషన్ గురించి బయట పెట్టలేదు. గతం లో వరుణ్ తేజ్ మరియు లావణ్య కూడా ఇలాగే చేసారు, కానీ చివరికి వాళ్లిద్దరూ పెళ్లిని ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేసారు. విజయ్ దేవరకొండ మరియు రష్మిక విషయం లో కూడా అదే జరగబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోగా వీళ్లిద్దరి నుండి శుభ వార్త వినొచ్చు.
ఇదంతా పక్కన పెడితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు గోపాల స్వామి వీళ్లిద్దరి రిలేషన్ గురించి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన జ్యోతిష్యం ప్రకారం విజయ్ దేవరకొండ మరియు రష్మిక కూడా వరుణ్ – లావణ్య లాగానే మీడియా కి దూరంగా పెళ్లి చేసుంటారని, కానీ వీళ్లిద్దరి జాతకాల దృష్ట్యా వీళ్ళు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.
గతం లో రష్మిక కి నేరుగానే ఈ విషయం నేను చెప్పానని, కానీ నేను చెప్పిన ఆ నిజం ఆమెకి నచ్చలేదని, విజయ్ దేవరకొండ ని పెళ్లి చేసుకోకు అని నేను నేరుగా చెప్పడం వల్ల ఆమెకి నాకు మధ్య మాట మాట పెరిగి గొడవలు అయ్యాయని , అప్పటి నుండి రష్మిక కి నాకు మాటల్లేవ్ అంటూ వేణు గోపాల స్వామి చెప్పుకొచ్చాడు.