Family Star : హీరో విజయ్ దేవరకొండ గీతగోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీతారాం అందాల మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ మూవీని నిర్మించారు. విజయ్, పరశురామ్ కలిసి గీత గోవిందం మ్యాజిక్‌ని రిపీట్ చేశారా? ఫ్యామిలీ స్టార్ ఓవర్సీస్ ప్రీమియర్ల టాక్ ఎలా ఉంది?
టీవీ సీరియల్స్ లాగా…ఫ్యామిలీ స్టార్ అంటే చాలా నెగిటివ్ టాక్ వస్తోంది. ఫ్యామిలీ స్టార్ తో మరోసారి విజయ్ దేవరకొండ కథ ఎంపిక విషయంలో ఫేలయ్యాడా అంటూ నెటిజన్లు అంటున్నారు. ఇది రొటీన్ టెంప్లేట్ రొమాంటిక్ కామెడీ మూవీ అని, ఈ సినిమాలో నిజమైన ఎమోషనల్ కనెక్షన్స్, ఫీల్‌గుడ్ మూవ్‌మెంట్స్ మిస్ అవుతున్నాయని వెంకీ రివ్యూస్ అనే నెటిజన్ చెప్పాడు. ఈ సినిమా టీవీ సీరియల్‌ని గుర్తుకు తెస్తుంది అని అన్నారు. విజయ్ దేవరకొండ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తే బాగుంటుందని అన్నారు. గీత గోవిందం ఫార్ములాను కాపీ కొట్టి దర్శకుడు పరశురామ్ ఈ సినిమా తీసి నిరాశపరిచాడు.
బోరింగ్ సెకండాఫ్..గీత గోవిందం సినిమాకు సంగీతం, కామెడీ ప్లస్ పాయింట్స్ అని, అదే రిపీట్ చేసి హిట్ కొట్టాలనే ప్రయత్నం పూర్తిగా మిస్ ఫైర్ అని అంటున్నారు. మ్యూజిక్ ఫ్యామిలీ స్టార్ అంటే పెద్ద మైనస్ అని వ్యాఖ్యానించారు. సెకండాఫ్ చాలా బోరింగ్ గా ఉందని, కథలోని ప్రధాన సంఘర్షణకు బలం లేదని పలువురు నెటిజన్లు అంటున్నారు. అనవసరమైన రిపీటెడ్ సీన్లతో సినిమా సహనానికి పరీక్ష పెడుతుందని అంటున్నారు. విజయ్, మృణాల్ తప్ప మిగతా పాత్రలన్నీ చక్కగా ఒదిగిపోయాయని, దర్శకుడు హాస్యాన్ని సరిగ్గా రాయలేకపోయాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హీరో ఫ్యామిలీ పడుతున్న కష్టాల్లో సహజత్వం మిస్ అయ్యిందని పేర్కొన్నారు.