ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యూత్ లో స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ, కేవలం రెండు మూడు సినిమాలతోనే క్రేజ్ సంపాదించాడు. అసలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయాడు. సినిమా ఎలాంటిదైనా తన విచిత్రమైన వేషాలతో హైప్ రప్పించడం లో ప్రస్తుతం ఈ హీరో కి మించినోడు ఎవ్వరూ లేరు.

అయితే కొన్ని సార్లు పబ్లిసిటీ విషయం లో విజయ్ దేవరకొండ హద్దులు దాటి ప్రవర్తించినట్టు అనిపిస్తుంది. బాలీవుడ్ లో అలవాటు పడిన కల్చర్ ని టాలీవుడ్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కానీ, మన ఆడియన్స్ కి చూసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ఖుషి ‘మ్యూజిక్ కన్సర్ట్’ లో స్టేజి మీద చేసిన ఒక చిన్న యాక్ట్ ఇప్పుడు విమర్శల పాలయ్యేలా చేస్తుంది.

ఈ చిత్రం లో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. న్యూ ఏజ్ లవ్ స్టోరీ లాగ అనిపించింది ఈ ట్రైలర్ ని చూస్తుంటే. అయితే నేడు నిర్వహించిన ‘ఖుషి మ్యూజిక్ కన్సర్ట్’ లో సమంత తో విజయ్ దేవరకొండ చేసిన రొమాంటిక్ బిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ తాను వేసుకున్న చొక్కాని విప్పేసి సమంత ని ఎత్తుకొని తిప్పడం, హాగ్ చేసుకోవడం వంటివి సెన్సషనల్ గా మారింది. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడొచ్చు, సమంత రేంజ్ స్టార్ స్టేటస్ ఉన్న ఒక హీరోయిన్ పబ్లిక్ గా ఇలా చెయ్యడం పై సోషల్ మీడియా లో తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది.