బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదహారేళ్ల వయసులోనే నటనా జీవితాన్ని ప్రారంభించిన విద్యా బాలన్.. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడింది. మలయాళ, తమిళ భాషల్లో విద్యా బాలన్ నటించిన పలు సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం, విడుదలకు నోచుకోకపోవడం వంటివి జరగడంతో ఆమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను తగిలించారు. అయితే ఎన్నో అవమానాలను ఎదుర్కొని.. చివరకు 2005లో పరిణీత సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది.
ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది. సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్
మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. నేషనల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యా బాలన్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి అనేక విషయాలను పంచుకుంది. తన భర్తను చూడగానే తనకు కలిగిన ఫీలింగ్ ని ఆమె చెప్పగా అందరూ విని షాకయ్యారు. చాలా మంది లవ్ ఎట్ ఫస్ట్ తమకు కలిగింది అని చెప్పడం విని ఉంటారు. కానీ విద్యా బాలన్ మాత్రం తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను మొదటి సారి చూసినప్పుడు తనకు లస్ట్ ఫీలింగ్ కలిగిందని ఆమె చెప్పడం గమనార్హం.
‘నిజానికి మా ఇద్దరిదీ మొదటి చూపులోనే కామం లాంటిది. సిద్దార్థ్ ను చూడగానే నాకు కామం పుట్టింది. ఎందుకంటే అతను చాలా అందగాడు. మంచి లుక్స్ ఉన్న వ్యక్తి. అందుకే అతని మీద అట్రాక్షన్ ఏర్పడింది. ఆతర్వాత అతను చాలా సెక్యూర్డ్ గా చూసుకోవడంతో అతనిపై నాకు లవ్ పుట్టింది.’ అని ఆమె చెప్పారు.తన భర్త తనకు అన్ని విషయాల్లోనూ చాలా సపోర్టివ్ గా ఉంటారని అలా ఉండే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని విద్యా బాలన్ అన్నారు. తన తండ్రి తర్వాత అంత ప్రేమను తాను సిద్ధార్థ్ దగ్గరే పొందానని ఆమె చెప్పారు. అందుకే అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు.