Victory Venkatesh : నయనతార ఒక గొప్ప నటి, ఆమె సౌత్ లో ఉన్న హీరోయిన్స్ అందరికంటే పెద్ద సూపర్ స్టార్ అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కేవలం ఈమెని చూసేందుకే ఆడియన్స్ థియేటర్స్ కి క్యూలు కడుతుంటారు. ఇక్కడ వరకు ఒప్పుకోవచ్చు. కానీ నయనతార కి తానూ పెద్ద ఆర్టిస్టుని అనే గర్వం మామూలుగా ఉండేది కాదని ఇది వరకే చాలా మంది చెప్తూ వచ్చారు. ఆమెకంటే చిన్న నటులను, దర్శకులను అసలు కేర్ కూడా చెయ్యడట. ఇది వరకు ఎంతో మంది డైరెక్టర్లు ఓపెన్ గానే అనేక ఇంటర్వూస్ లో ఈమె గురించి చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు మారుతీ విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో పట్ల నయనతార ప్రవర్తించిన తీరు గురించి చెప్తూ భావోద్వేగానికి గురి అయ్యాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే విక్టరీ వెంకటేష్, మారుతీ కాంబినేషన్ లో నయనతార హీరోయిన్ గా బాబు బంగారం అనే చిత్రం వచ్చింది. నయనతార తో వెంకటేష్ కి ఇది మూడవ చిత్రం. ఈ చిత్రానికి ముందు వీళ్ళు లక్ష్మీ, తులసి వంటి చిత్రాలలో నటించారు. అయితే మారుతీ నయనతార గురించి చెప్తూ బాబు బంగారం సినిమా షూటింగ్ సమయం లో నేను నయనతార వల్ల ఎన్నో అవమానాలను ఎదురుకున్నాను. నేను ఇండస్ట్రీ ఇండస్ట్రీ లో చిన్న దర్శకుడుని అని ఆమెకి ఎంతో చిన్న చూపు ఉండేది, నా మాటలను లెక్క చేసేది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. నన్ను లెక్కచేయకపోయిన నేను బాధపడేవాడిని కాదు, విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరో పట్ల కూడా ఆమె దురుసు ప్రవర్తన అలాగే ఉండేది.
అది తట్టుకోలేకపోయాను. బాబు బంగారం సినిమా సమయం లో ఒక సాంగ్ బ్యాలన్స్ ఉంది, డేట్స్ కోసం నయనతార కి ఫోన్ చేస్తే కుదరదు, వేరే సినిమాలతో బిజీ గా ఉన్నాను అని పొగరుగా సమాధానం చెప్పింది. ఎంతో బ్రతిమిలాడాను, కానీ ఆమె కనికరించి డేట్స్ ఇవ్వలేదు. చివరికి ఆ పాట లేకుండానే సినిమాని విడుదల చెయ్యాల్సి వచ్చింది అంటూ మారుతీ బావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ తో ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తున్నాడు. వరుస ఫ్లాప్స్ తో ఉన్న ఆయన ప్రస్తుతం ఈ చిత్రం మీదనే భారీ ఆశలు పెంచుకున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.