Bad Newz Trailer : యానిమల్ సినిమా దేశవ్యాప్తంగా ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ విడుదల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చి సెన్సేషన్ గా మారిపోయింది తృప్తి దిమ్రీ. సినిమాలో ఆమె ఉన్నది 15నిమిషాలే కావొచ్చు. కానీ, పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇప్పుడు ఆమె నుంచి వచ్చే ఏ మూవీ అయినా బ్రేక్ ఇవ్వడానికి వాళ్లు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ ఒక క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా అలాంటి ఇలాంటి కాన్సెప్ట్ కాదు. తన బిడ్డకు ఇద్దరు తండ్రులు.. వైద్యశాస్త్రంలోనే అరుదైన ఘట్టం ఇది.
ఈ సినిమా పేరు ‘బ్యాడ్ న్యూస్’. గతకొన్ని వారాలుగా బాలీవుడ్ సహా.. ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ పోస్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన ట్రైలర్ వరకు ప్రేక్షకుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. వింటానికి ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక అమ్మాయి ఇద్దరితో ప్రేమలో పడుతుంది. ఆ ఇద్దరితో హద్దులు దాటేస్తుంది. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే ఆమెకు ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే.. ఇద్దరిలో తన బిడ్డకు తండ్రి ఎవరు? ఆ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా కష్టపడుతుంది.
మొదట తాను తల్లి అయిన విషయాన్ని ఇద్దరికీ చెప్తుంది. కానీ, ఆ తండ్రి ఎవరనేది మాత్రం చెప్పలేకపోతుంది. అసలు తండ్రి ఎవరో తెలుసుకోవడం కోసం ఆమె చేసే ప్రయత్నాల చుట్టూ సినిమా తిరుగుతుంది. అయితే వీళ్లు డాక్టర్లను కలుస్తారు. అందుకు డాక్టర్లు ఒక మార్గం చెప్తారు. అందుకు కొన్ని టెస్టులు కూడా చేస్తారు. ఆ పరీక్షల్లో వైద్యశాస్త్రంలోనే మహాద్భుతం వెలుగు చూస్తుంది. అదేంటంటే.. ఒక ఎగ్ లోకి రెండు కణాలు వెళ్తాయి. అది కూడా ఇద్దరు హీరోలవి.
అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఇద్దరూ తండ్రులు అని తెలిసిన తర్వాత.. వారిలో ఎవరు బెస్టో తెలుసుకోవాలనుకుంటుంది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అయితే వారినే తన బిడ్డకు తండ్రిని చేయాలని భావిస్తుంది. అక్కడి నుంచే ఇద్దరు హీరోలు విక్కీ కౌశల్- ఎమ్మీ విర్క్ ల మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరిలో ఎవరు బెస్టో తేల్చుకోవడానికి చాలానే కష్టపడతారు. ఈ మూవీ జూలై 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.