Venu Swamy : నయనతార విఘ్నేష్ శివన్ చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆలస్యంగా నయన్ విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సరోగసి ద్వారా నయన్ తల్లయ్యారు. అయితే పెళ్లి తర్వాత నయన్ విఘ్నేష్ కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. నయనతార రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

అయితే నయన్ విఘ్నేష్ జాతకాలు కలవలేదని గతంలో వేణుస్వామి వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ నయనతారకు పెళ్లి అనేది అచ్చిరాదని ఆయన తెలిపారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఆమెకు ఏదో ఒక సమస్య వస్తుందని వేణుస్వామి పేర్కొన్నారు. నయనతార సుదీర్ఘకాలం పాటు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారని ఆయన వెల్లడించారు. పరిహారాలు ఉంటాయని వాటిని చేసుకోరని వేణుస్వామి పేర్కొన్నారు. వేణుస్వామి అప్పట్లో నయనతార జాతకం గురించి చెప్పిన విషయాలు పెళ్లి తర్వాత నిజమవుతున్నాయి. అయితే నయన్ విఘ్నేష్ మధ్య విబేధాల గురించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి ఈ జంట నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

నయనతార ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. తెలుగు నుంచి కూడా నయన్ కు మూవీ ఆఫర్లు అయితే వస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌ను అన్‌ఫాలో చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. దీంతో నెట్టింట రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వాటన్నింటికీ ఆమె చెక్ పెడుతూ నయనతార తిరిగి విఘ్నేశ్‌ను ఫాలో అవుతున్నారు. అలాగే, విఘ్నేష్ ఆమె ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారానికి ముగింపు పడింది.