Venu Gopal Swamy : సోషల్ మీడియా లో స్టార్ సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ హడావడి చేసే వ్యక్తి వేణు గోపాల స్వామి. ఎదో ఒకటి రెండు సార్లు చీకట్లో బాణం తగిలేలోపు, దానిని అడ్డం పెట్టుకొని సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. సమంత మరియు నాగ చైతన్య విడిపోతారు అన్నాడు. విడిపోయారు, ఆ తర్వాత బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిట్ ఉండదు అన్నాడు.
మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ, రీసెంట్ గా సలార్ తో రీసౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ దెబ్బతో ఆయనకీ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన ట్రోలింగ్ ఎదురైంది. అలాగే రాబొయ్యే రెండు మూడేళ్ళలో ఒక స్టార్ హీరో చనిపోతాడని, రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కి చాలా లోపాలు ఉంటాయని, ఇలా ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు.
ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఈ ఏడాది లో ఇద్దరు స్టార్ సెలెబ్రిటీలు విడాకులు తీసుకోబోతున్నారంటూ మరోసారి నోరు జారాడు. పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినావా తో విడాకులు తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఆయన ప్రతీ ఏడాది చెప్తూనే వచ్చాడు, కానీ జరిగింది. మళ్ళీ ఈ ఏడాది పాడిందే పాట అన్నట్టుగా అదే పాట పాడాడు. అలాగే పెళ్లి చేసుకొని ఎంతో లక్షణంగా ఉన్నటువంటి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కూడా ఈ ఏడాది విడిపోతారు అని చెప్పుకొచ్చాడు.
వీళ్ళ సంగతి పక్కన పెడితే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవర కొండా, రష్మిక కూడా విడిపోతారని, రష్మిక కి నేరుగానే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పానని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇక ప్రభాస్ కి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా అతనికి పెళ్లి జరిగే అవకాశమే లేదని, ఒకవేళ జరిగిన విడిపోతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఈయన నోటి నుండి ఒక్కటంటే ఒక్క శుభం కూడా పలకదు, ఎదో ఒక రోజు అభిమానులతో కొట్టించుకుంటాడు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.